కరోనా కేసులు తగ్గుతున్న వేళ పలు దేశాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించేందుకు సిద్ధమవుతున్నాయి. న్యూజిలాండ్‌లో కఠిన లాక్డౌన్ నిబంధనలను ఈ రోజు అర్ధరాత్రి నుంచి సడలించనుంది అక్కడి ప్రభుత్వం. దేశంలో సామాజిక వ్యాప్తి లేదని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జెంసిండా అడెర్న్.. భౌతిక దూరం నిబంధన అమలు చేస్తూనే మినహాయింపులు ఇచ్చారు.
వైరస్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన ఐరోపా దేశాలు ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు విధానాలను రూపొందిస్తున్నాయి. స్పెయిన్‌లో 14 ఏళ్లలోపు పిల్లలను ఆడుకునేందుకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మరిన్ని మినహాయింపులను స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మంగళవారం ప్రకటించనున్నారు.
విధుల్లోకి జాన్సన్..
కరోనా నుంచి కోలుకున్న అనంతరం.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నారు. కొద్దిరోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలను బయటి నుంచే నడిపించిన ఆయన తిరిగి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.
ఇటలీలో..
ఇటలీలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో 260 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కర్మాగారాలు, భవన నిర్మాణ పనలు, హోల్‌సేల్ సరఫరా వ్యాపారాలపై ఆంక్షల సడలింపులకు ప్రధాని గిసెప్పీ కాంట్ పచ్చజెండా ఊపారు. అయితే ప్రభుత్వం సూచించిన భద్రత చర్యలు తీసుకున్న తర్వాతనే కార్యకలాపాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
మే 4 తర్వాత పార్కులు, తోటలతో పాటు క్రీడాకారులు శిక్షణను కొనసాగించవచ్చని తెలిపారు కాంట్. సమీపంలో ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లవచ్చన్నారు. అన్ని సక్రమంగా జరిగితే మే 18 నాటికి మాల్స్, మ్యూజియాలు.. జూన్ 1 వరకు రెస్టారెంట్లు, క్షౌర శాలలు తెరిచేందుకు అనుమతి ఇస్తామన్నారు.
అయితే మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించటం తప్పనిసరని స్పష్టం చేశారు ఇటలీ ప్రధాని.
ఇతర ఐరోపా దేశాల్లో..