ఫ్రాన్స్‌లో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను సడలించింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో పారిస్‌లో పాఠశాలలను పునఃప్రారంభించారు అధికారులు. లాక్డౌన్ కాలంలో రెండునెలల పాటు ఇంట్లో గడిపిన విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టారు. చాలా రోజుల తర్వాత స్నేహితులు కనపడగా వారి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.
తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో భయాందోళన ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లల్లో శుభ్రతపై అవగాహన పెంచాలని పాఠశాల నిర్వహకులు అంటున్నారు.
విద్యార్థులు శానిటరీ ప్రోటోకాల్ గురించి అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం వారి స్థాయికి తగ్గట్లు పాటలు, సంగీతం ద్వారా చేతులను ఎలా శుభ్రపరుచుకోవాలనే విషయం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. కానీ పిల్లల్లో భౌతిక దూరం పాటించేలా చేయడమే కష్టం.