యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించాయి. రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు మధ్య బెలారస్లో చర్చలు కొనసాగుతున్నాయి. కాల్పులు, రాకెట్ దాడుల్లో సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి.
సాధారణ పౌరులను తరలించేందుకు ప్రత్యేక కారిడార్లు - రష్యా ఉక్రెయిన్ న్యూస్
India on Wednesday yet again abstained from a vote against Russia at the United Nations General Assembly. Only five countries voted against the resolution, while 35 abstained and 12 absented themselves.
00:28 March 04
23:44 March 03
నాతోనే చర్చలు జరపాలి: జెలెన్‌స్కీ
రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. "మేము రష్యాపై దాడి చేయట్లేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. అలాంటప్పుడు మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు. వెంటనే మా భూభాగం నుంచి వెళ్లిపోండి" అని జెలెన్‌స్కీ అన్నారు.
తమకు రక్షణ సాయం పెంచాలని లేకుంటే పశ్చిమదేశాలపై కూడా రష్యా దండయాత్ర చేస్తుందని యూరప్ దేశాలకు పిలుపునిచ్చారు. రష్యా వైమానిక దాడులను ఆపలేని పరిస్థితుల్లో ఉంటే.. తమ దేశానికి విమానాలు ఇవ్వండని జెలెన్‌స్కీ కోరారు. ఈ యుద్ధం ఉక్రెయిన్‌తోనే ఆగిపోదని.. తర్వాత పశ్చిమ దేశాలపైన లాత్వియా, లిథువేనియా, ఈస్టోనియాకు విస్తరిస్తోందన్నారు.
22:01 March 03
రష్యాకు ఉక్రెయిన్ మరో షాక్.. ఆస్తుల సీజ్‌కు పార్లమెంట్ ఆమోదం
కీవ్: తమ దేశంపై భీకర యుద్ధంతో విరుచుకుపడుతున్న రష్యాకు ఉక్రెయిన్‌లోని జెలెన్‌స్కీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తులు సీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ ,పౌరుల ఆస్తులు సీజ్ చేసే చట్టానికి ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
22:00 March 03
చెర్నిహివ్‌లో రష్యా భీకరదాడులు.. 22మంది మృతి
ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ ప్రాంతంలో రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో 22మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెర్నిహివ్ గవర్నర్ వెల్లడించారు. మరోవైపు, అక్కడి స్థానికులకు సురక్షిత మార్గం ఏర్పాటు చేసేందుకు ఉక్రెయిన్ అధికారులు శ్రమిస్తున్నారని తెలిపారు.
20:31 March 03
మొదలైన రష్యా, ఉక్రెయిన్ రెండో విడత చర్చలు..
రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండో విడత చర్చలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రస్తుత యుద్ధ పరిస్థితులను ముగించడంతోపాటు డాన్‌బాస్‌లో శాంతిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ శాంతియుత జీవనానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్లు చెప్పింది.
19:53 March 03
‘ఖర్కివ్‌లోని భారతీయులారా.. అత్యవసరంగా ఈ దరఖాస్తు నింపండి’
రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ అట్టుడుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు స్థానిక భారత రాయబార కార్యాలయం అత్యవసర ప్రాతిపదికన ఓ దరఖాస్తు నింపాలంటూ సూచించింది. పిసొచిన్ మినహా ఖర్కివ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ.. ఆ దరఖాస్తులో వివరాలను నింపాలంటూ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
17:57 March 03
భారతీయుల కోసం రష్యా బస్సులు..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను తరలించేందుకు 130 బస్సులను సిద్ధం చేసినట్లు రష్యా తెలిపింది. ఖార్కోవ్, సుమీ నగరాల్లోని ఇతర దేశాల పౌరులను తరలిస్తున్నట్లు తెలిపింది. రష్యాలోని బెలగోరోడ్ ప్రాంతానికి వీరిని చేర్చుతున్నట్లు ఆ దేశ సైనిక జనరల్ వెల్లడించారు.
16:55 March 03
పరిపాలనా భవనం హస్తగతం
ఖార్కివ్‌లోని ప్రాంతీయ పరిపాలనా భవనాన్ని రష్యా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ ప్రాంత గవర్నర్ వెల్లడించారు.
ఐకియా సేవలు బంద్
మరోవైపు, రష్యా, బెలారస్లలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రముఖ ఫర్నీచర్, కిచెన్ అప్లయన్సెస్ సంస్థ ఐకియా ప్రకటించింది. దీని వల్ల 15 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని తెలిపింది.
14:26 March 03
'9 వేల మందిని చంపాం'
యుద్ధం జరుగుతున్నప్పటినుంచి 9 వేల మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.
14:24 March 03
రష్యా సుఖోయ్ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్
రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యాకు చెందిన సుఖోయ్ ఎస్-30 విమానాన్ని ఉక్రెయిన్ సైన్యం కూల్చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఇర్పిన్ ప్రాంతంలో ఈ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు తెలిపింది.
12:24 March 03
ఖర్కివ్‌లో భీకర దాడులు..
ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా ఇక్కడ క్షిపణులు, ఫిరంగులను ప్రయోగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే అనేక మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉండటం బాధాకరం.
12:24 March 03
పుతిన్‌కు వ్యతిరేకంగా అతిపెద్ద కూటమి..
ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా.. వీలైనంత పెద్ద కూటమి ఏర్పాటు కావాలని బ్రిటన్ పిలుపునిచ్చింది. ఇందులో భారత్ కూడా ఉండాలని పేర్కొంది. ఉక్రెయిన్ నగరాలపై పుతిన్ దాడులను విశ్వవ్యాప్తంగా ఖండించాలంటూ.. ప్రపంచ నేతలను కోరుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలోనే ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని దేశాలూ రష్యా అధ్యక్షుడికి సాధ్యమైనంత స్పష్టమైన సందేశం పంపించేలా ఏకతాటిపైకి రావాలన్నదే బ్రిటన్ లక్ష్యమని చెప్పారు.
10:32 March 03
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్వాడ్ దేశాధినేతల భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా గురువారం సమావేశమై.. కీలక చర్చలు జరపనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలపై ప్రధానంగా వీరు సమాలోచనలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
10:24 March 03
10 లక్షలమందికిపైగా వలస..
యుద్ధం జరుగుతున్నప్పటినుంచి ఉక్రెయిన్‌లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం చెప్పింది. ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా పొరుగు దేశాలకు తరలివెళ్లారని ఓ నివేదికలో వెల్లడించింది.
07:36 March 03
ఖేర్సన్ రష్యా హస్తగతం..
ఖేర్సన్ నగరాన్ని రష్యా హస్తగతం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఏఎఫ్‌పీ నివేదించింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్వైపు వేగంగా పయనిస్తోంది రష్యా సైన్యం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అప్రమత్తమైంది. కీవ్, కీవ్ ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, ఒడేసా సహా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించింది.
ఇదీ చూడండి:ఉక్రెయిన్ నగరాలపై రష్యా విధ్వంసం.. 'అదే జరిగితే అణు యుద్ధమే'
07:31 March 03
రష్యా బాంబుల మోత..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్‌లోని డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ సమీపంలో రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక పత్రిక వెల్లడించింది. అంతకుముందు కూడా రెండు భారీ పేలుడు ఘటనలు సంభవించినట్లు తెలిపింది.
06:50 March 03
ఆపరేషన్ గంగ వేగవంతం.. మరో 400 మందికిపైగా స్వదేశానికి..
Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు చర్చలు.. మరోవైపు యుద్ధంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. యుద్ధప్రాతిపదికన భారత పౌరుల్ని స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. ఇప్పటికే కీవ్ సహా ఖర్కివ్ నగరాల నుంచి భారతీయుల్ని తక్షణమే వెళ్లిపోవాలని కేంద్రం హెచ్చరించింది.
ఆపరేషన్ గంగలో భాగంగా.. భారత పౌరుల్ని వేగంగా తరలిస్తోంది కేంద్రం.
భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. 220, 208 మంది చొప్పున భారతీయుల్ని తీసుకొచ్చాయి. దిల్లీ హిందన్ ఎయిర్‌బేస్ సమీపంలో ల్యాండయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి అజయ్ భట్.. భారతీయులకు స్వాగతం పలికారు.