2100 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమైన తర్వాత మరియుపోల్‌లో 2,100 మంది పౌరులు చనిపోయారని అక్కడి మేయర్ తెలిపారు.
20:50 March 13
2100 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమైన తర్వాత మరియుపోల్‌లో 2,100 మంది పౌరులు చనిపోయారని అక్కడి మేయర్ తెలిపారు.
16:36 March 13
35కు మృతుల సంఖ్య
ఉక్రెయిన్‌లో సైనిక స్థావరంపై రష్యా జరిపిన దాడిలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. ఈ మేరకు స్థానిక కార్యాలయం వెల్లడించింది.
14:33 March 13
9 మంది మృతి
రష్యా వైమానిక దాడుల్లో 9 మంది మరణించారని ఉక్రెయిన్‌లోని ల్వీవ్ గవర్నర్ తెలిపారు. మిలిటరీ స్థావరంపై ఈ దాడి జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో 57 మంది గాయపడ్డారని తెలిపారు.
13:45 March 13
ఆహారం, ఔషధాల ట్రక్కులపై రష్యా సేనల దాడులు
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన మెరియుపోల్‌కు అందుతున్న సాయాన్ని రష్యన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఆహారం, మంచినీరు, ఔషధాల వంటి సామగ్రితో వెళుతున్న ట్రక్కులపైనా దాడులు జరిగాయి. అలాగే నగరాన్ని వీడి వెళుతున్న పౌరులనూ అడ్డుకుంటుండడం గమనార్హం. కీవ్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం నుంచి ట్రక్కుల్లో వెళుతున్న కొంతమందిపై రష్యన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా ఏడుగురు పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి.
మెరియుపోల్‌లో ఇప్పటి వరకు 1,500 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ కార్యాలయం ప్రకటించింది. మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉండడం లేదని స్థానికులు వాపోయారు.
13:45 March 13
రష్యా.. ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు వాడొచ్చు!
ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ ప్రధాన నగరాలను చుట్టుముడుతున్న రష్యా.. దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా.. ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలను వాడొచ్చని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. యుద్ధంలో భాగంగా దాడులకు రసాయన, జీవాయుధ ల్యాబ్‌ల వినియోగం గురించి అసంబద్ధమైన వార్తలొచ్చాయని వాటిలో ఎంతవరకు నిజముందో తేల్చాలన్నారు. ఏదేమైనా రష్యా రసాయన దాడులకు పాల్పడటానికి అవకాశం ఉన్న నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు.
13:44 March 13
మిలిటరీ ట్రైనింగ్ సెంటర్‌పై రష్యా వైమానిక దాడులు
ఉక్రెయిన్‌లోని పశ్చిమ భాగంలో ఉన్న ప్రధాన నగరం లవీవ్‌కు సమీపంలో రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. యవరివ్ జిల్లాలో లీవ్‌కు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలిటరీ ట్రైనింగ్ సెంటర్‌పై 8 క్షిపణులతో రష్యా దాడి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా వెల్లడి కాలేదు.
13:43 March 13
ఉక్రెయిన్- రష్యా మధ్య మరిన్ని సమావేశాలు: ఐరాస
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐరాస ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ వారంలో ఉక్రెయిన్- రష్యా మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐరాస ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు.
13:34 March 13
మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశ భద్రతా సంసిద్ధతపై ఈ సమావేశంలో ప్రధాని ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
13:34 March 13
ఎయిర్‌పోర్ట్‌పై రష్యా వైమానిక దాడి
పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఇవానో- ఫ్రాంకిస్క్ నగరంలోని విమానాశ్రయంపై రష్యా వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైందని నగర మేయర్ రస్లన్ వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రజలెవరూ ప్రాణాలు కోల్పోలేదని చెప్పారు. ఈ విమానాశ్రయంపై ఇది మూడో దాడి అని రస్లన్ తెలిపారు.
13:32 March 13
పుతిన్‌తో చర్చలకు సిద్ధం: జెలెన్‌స్కీ
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తో జెలెన్‌స్కీ మాట్లాడారు. జెరూసలెంలో పుతిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. లీవ్‌కు సమీపంలోని మిలటరీ ట్రైనింగ్ సెంటర్‌పై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది.
11:12 March 13
రష్యా చుట్టూ అమెరికా సేనలు
రష్యా సరిహద్దు ప్రాంతాలకు సుమారు 12 వేల ట్రూపుల సైన్యాన్ని తరలిస్తున్నామని.. వారంతా లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా, రొమేనియా భూభాగాల్లో మోహరిస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అయితే, మూడో ప్రపంచ యుద్ధం నిమిత్తం వారిని ఉక్రెయిన్‌కు పంపడం లేదని, నాటో భూభాగంలో ప్రతి అంగుళాన్నీ కాపాడతామన్న సందేశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. బైడెన్ ఈ మేరకు హౌస్ డెమోక్రటిక్ కాకస్ సభ్యులను ఉద్దేశించి మంగళవారం మాట్లాడారు.
11:11 March 13
ప్రముఖ నగరాలను చుట్టుముట్టిన రష్యా సేనలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ప్రముఖ నగరాలను రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 15 కి.మీ దూరంలో సేనలు విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. రష్యా దాడిలో పలు చిన్న నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని జెలెన్‌స్కీ వివరించారు. యుద్ధంలో తమ సైనికులు 1,300 మంది చనిపోయారని తెలిపారు. యుద్ధంలో 579 మంది పౌరులు మృతి, వెయ్యి మందికిపైగా గాయపడ్డారని ఐరాస తెలిపింది.
09:33 March 13
శరణార్థి కాన్వాయ్‌పై దాడి.. ఏడుగురు ఉక్రెయిన్ పౌరుల మృతి
ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతం నుంచి తరలించేందుకు ఏర్పాటు చేసిన మానవతా కాన్వాయ్‌పై రష్యా దాడి చేసింది. వారిని బలవంతంగా వెనక్కి వెళ్లేలా చేసింది. రష్యా బలగాల దాడిలో ఓ చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌కు ఈశాన్యంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరెమోహా గ్రామం నుంచి వందల మంది స్థానికులు వలస వెళ్లేందుకు ప్రయత్నించగా ఈ దాడికి పాల్పడ్డాయి రష్యన్ బలగాలు. ఇందులో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
07:08 March 13
Russia Ukraine crisis: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం లైవ్ అప్డేట్స్
Russia Ukraine crisis: ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. అమెరికా, నాటో, ఐరోపా భాగస్వామ్య దేశాల మధ్య ఐక్యతను ఎత్తిచూపారు. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న దాడులతో అన్ని ప్రజాస్వామ్య దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. 'రష్యా దురాక్రమణ కేవలం ఉక్రెయిన్ ప్రజాస్వామ్యంపైనే కాదు.. ఐరాపా వ్యాప్తంగా ప్రజాస్వామ్యాలపై ప్రభావం చూపుతుంది. మా మిత్రదేశాల మధ్య ఐక్యతే మాకు బలం' అని పేర్కొన్నారు.
కొత్త మేయర్ ఎంపిక..
మెలిటొపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యం.. ఆ నగర మేయర్‌ను అపహరించుకుపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం ఆరోపించారు. శత్రు సైనికులకు సహకరించట్లేదనే ఉక్రోషంతో ఇలా చేసినట్లు తెలిపారు. ఇది ఐసిసి ఉగ్రవాదుల చర్యకంటే తక్కువేం కాదని మండిపడ్డారు. మేయర్ విడుదలకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌ను కోరారు జెలెన్‌స్కీ.
మరోవైపు.. మెలిటోపోల్ నగరానికి కొత్త మేయర్‌ను నియమించినట్లు జపోరిజ్జియా స్థానిక పరిపాలన విభాగం తెలిపింది. రష్యా అపహరించిన ఇవాన్ ఫెడొరోవ్ స్థానంలో గలినా డనిల్చేంకోను ఆ స్థానంలో కూర్చోబెట్టినట్లు స్థానిక మీడియా సంస్థ ప్రకటించింది.
రెండు రష్యా హెలికాప్టర్ల కూల్చివేత: ఉక్రెయిన్
ఖెర్సాన్ ఓబ్లాస్ట్ నగరంలోకి ప్రవేశించిన రెండు రష్యా హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అందులో ఓ పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడని, స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు కీవ్ ఇండిపెండెంట్ మీడియా తెలిపింది.
1300 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి: జెలెన్‌స్కీ
రష్యా సైనిక చర్య చేపట్టినప్పటి నుంచి మొత్తం 1300 మంది ఉక్రెయిన్ సైనికులు వీరమరణం పొందారని తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. దేశ రాజధాని కీవ్‌పై బాంబుల వర్షం కురిపించి స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని తెలిపారు.