తెలంగాణ

telangana

ETV Bharat / international

నీరవ్​ మోదీకి మళ్లీ నిరాశే.. దక్కని బెయిల్​

వజ్రాల వ్యాపారి, పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీ బెయిల్​ దరఖాస్తును తిరస్కరించింది లండన్​లోని వెస్ట్​మినిస్టర్ మేజిస్ట్రేట్​​ కోర్టు. 2 మిలియన్ పౌండ్ల పూచీకత్తు సమర్పిస్తామని బెయిల్ వినతిలో పేర్కొన్నారు నీరవ్​ తరఫు న్యాయవాది. అయినా అంగీకరించలేదు కోర్టు.

By

Published : May 9, 2019, 12:50 AM IST

మూడోసారి నీరవ్ మోదీ బెయిల్ తిరస్కరణ

వజ్రాల వ్యాపారి, పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీకి లండన్​ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. నీరవ్ మూడోసారి దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను లండన్​లోని వెస్ట్​మినిస్టర్ మేజిస్ట్రేట్​​ కోర్టు తిరస్కరించింది. 2 మిలియన్​ పౌండ్ల పూచీకత్తు సమర్పించేందుకు అంగీకరిస్తూ ఈ సారి బెయిల్ కోసం దరఖాస్తు చేశారు నీరవ్. అవసరమైతే 24 గంటలు లండన్​లోని నీరవ్ నివాసంలో భద్రతను ఏర్పాటు చేయవచ్చని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించినా ఫలితం దక్కలేదు.

"జైలులోని పరిస్థితులు జీవించేందుకు అనుకూలంగా లేవు. మీరు ఏ నిబంధనలు విధించినా అనుసరించేందుకు నీరవ్ సిద్ధంగా ఉన్నారు."

-క్లేర్ మాంట్​గొమేరి, కోర్టులో నీరవ్ తరఫు న్యాయవాది

నీరవ్ తరఫు న్యాయవాది వాదనలతో ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. నీరవ్ చాలా పెద్ద మోసానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. ఆయన కోర్టు ముందు లొంగిపోకపోతే రెట్టింపు చేసిన పూచీకత్తు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.

భారత్​ తరఫున బ్రిటన్ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. నీరవ్​కు బెయిల్​ మంజూరు చేయకూడదని కోర్టును అభ్యర్థించింది. నీరవ్​ తరఫు న్యాయవాదులు సమర్పించిన వివరాలు పరిస్థితులను మార్చేందుకు ఏ విధంగానూ ఉపకరించవని చెప్పింది.

మార్చి 20న జిల్లా కోర్టులో మొదటిసారిగా నీరవ్​​ బెయిల్ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. మార్చి 29న లండన్​ వెస్ట్​ మినిస్టర్ మేజిస్ట్రేట్​​ కోర్టులో బెయిల్​కు దరఖాస్తు చేశారు నీరవ్​. ఈ దరఖాస్తును తిరస్కరించారుప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు మూడోసారి పూచీకత్తును రెట్టింపు చేసి బెయిల్​కు విన్నవించినా నీరవ్​కు నిరాశే ఎదురైంది.

ఇదీ చూడండి: ఆంక్షలపై ఇరాన్​ ఎదురుదాడి- ఎత్తివేతకు డెడ్​లైన్​

ABOUT THE AUTHOR

...view details