చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు రొమేనియా అధికారులు. ప్రధానమంత్రి లుడోవిక్ ఆర్బన్ భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించడం, బహిరంగ ధూమపానం చేసినందుకు 600 డాలర్ల జరిమానా విధించారు. ఓ ప్రభుత్వ భవనంలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని ఆర్బన్, కేబినెట్ మంత్రులు ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఇందులో ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోగా.. భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు కనిపించారు. అలాగే వారిముందు మద్యం సీసాలు, సిగరెట్లు ఉన్నట్లు కనిపించింది.
ప్రధాని వివరణ..