రొమేనియా కేంద్ర ఆరోగ్య మంత్రి విక్టర్ కొస్టాక్ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు గల కారణాలను ఆయన తెలుపలేదు. దేశంలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలిగారు.
కరోనాపై పోరాడలేక కేంద్ర ఆరోగ్య మంత్రి రాజీనామా - latest coron news
రొమేనియా కేంద్ర ఆరోగ్య మంత్రి విక్టర్కొస్టాక్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దేశంలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనాను అరికట్టలేక కేంద్ర ఆరోగ్య మంత్రి రాజీనామా
వ్యక్తిగత కారణాలతో కొస్టాక్ రాజినామా చేశారని రొమేనియా ప్రధాని లుడోవిక్ ఆర్బన్ తెలిపారు. 'కొస్టాక్ రాజీనామా చాలా బాధకారమైన విషయం. నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం ప్రభుత్వానికి ఆయన అందించిన సేవలకు నా ధన్యావదాలు' అని అన్నారు ప్రధాని.
సోషల్ మీడియాలో రగడ...
రొమేనియాలో ఇప్పటివరకు 1,029 కరోనా కేసులు నమోదవ్వగా... 17మంది మరణించారు. అనేక మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
కరోనా చికిత్సకు సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేవని, కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదని ఇటీవల ఆ దేశ వైద్యాధికారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శించారు.
ఇదీ చూడండి : అమెరికాలో మన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం