తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆసియాలో కరోనా వ్యాప్తిపై 'రెడ్‌క్రాస్‌' ఆందోళన - ఆసియా దేశాలపై కొవిడ్​ పంజా

ఆసియా, పసిఫిక్​ ప్రాంతాల్లో కొవిడ్​-19 వ్యాప్తిపై రెడ్‌క్రాస్‌ అంతర్జాతీయ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వారాల వ్యవధిలో సుమారు 59లక్షల మంది మహమ్మారి బారినపడ్డారని పేర్కొంది. ఈ కారణంగా అక్కడి ఆసుపత్రులు, ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయంది.

Red cross
రెడ్​క్రాస్​

By

Published : May 13, 2021, 6:53 AM IST

ఆసియా, పసిఫిక్‌ ప్రాంత దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని రెడ్‌క్రాస్‌ అంతర్జాతీయ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు వారాల్లోనే ఈ ప్రాంతంలో 59లక్షల మందికి కొత్తగా వైరస్‌ సోకిందని.. ఫలితంగా ఆసుపత్రులు, ఆరోగ్యవ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపింది. ప్రపంచంలోని 10 దేశాల్లో వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తుండగా వాటిలో ఏడు దేశాలు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతానికే చెందినవని పేర్కొంది.

భారత్‌లో రెండు నెలల్లో నిర్ధరిత కరోనా కేసులు రెండింతలు కాగా.. లావోస్‌ కేవలం 12 రోజుల్లోనే ఈ దశకు చేరుకుందని వివరించింది. అధికారిక గణాంకాలు చెబుతున్న దానికన్నా వాస్తవంలో ఎక్కువ మందే వైరస్‌ బారినపడ్డారని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన 'అవర్‌ వరల్డ్‌' డేటా నివేదికను రెడ్‌క్రాస్‌ ఉటంకించింది. మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచ దేశాల మధ్య సహకారం ఇనుమడించాలని, వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, నగదు, ప్రాణాధార ఔషధాల్ని పెను ప్రమాదం ఎదుర్కొంటున్న ప్రజలకు అందజేసేలా చూడాల్సి ఉందని రెడ్‌క్రాస్‌ ఆసియా పసిఫిక్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ మాథ్యూ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:ఆ దేశంలో 10 నెలల కనిష్ఠానికి కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details