తెలంగాణ

telangana

ETV Bharat / international

వచ్చే వారంలోనే అందుబాటులోకి ఆక్స్​ఫర్డ్​ టీకా! - ఆక్స్​ఫర్ట్, ఆస్ట్రాజెనిక టీకా పంపిణీపై అంచనాలు

ఆక్స్​ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ వ్యాక్సిన్​ అందుబాటులోకి రానున్నట్లు బ్రిటన్​కు చెందిన ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. టీకాల తొలి బ్యాచ్‌ను వచ్చే వారంలో స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఆదేశాలు వెళ్లాయనేది ఈ కథనం సారాశం.

Oxford and AstraZeneca vaccine distribution Soon
త్వరలో పంపిణీకి ఆక్స్‌ఫోర్డ్, ఆస్ట్రాజెనిక కరోనా టీకా

By

Published : Oct 27, 2020, 8:00 AM IST

కరోనా నివారణ దిశగా ఎన్నో ఆశలు రేపుతున్న ఆస్ట్రాజెనెకా టీకా అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు ప్రముఖ బ్రిటన్‌ పత్రిక "ది సన్‌" పేర్కొంది. 'టీకాల తొలి బ్యాచ్‌ను వచ్చే వారంలో స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఆదేశాలు వెళ్లాయని' ది సన్‌ పత్రిక తన కథనంలో వెల్లడించింది. టీకాను ఆక్స్‌ఫోర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తుండగా.. బ్రిటన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్​హెచ్​ఎస్).. నవంబర్‌ 2న ప్రారంభమయ్యే వారంలో ఆస్ట్రాజెనికా టీకాల తొలి దశ పంపిణీ చేపట్టాడానికి సిద్ధమవుతున్నట్లు రాసుకొచ్చింది.

తొలుత వారికే..

దీనికోసం ఆ ప్రముఖ ఆసుపత్రిలోని సిబ్బందిని వినియోగించనుందని.., అందుకు అనుగుణంగా ఆసుపత్రిలోని అన్ని వైద్యసేవలను.. ఇప్పటికే నిలిపివేశారని వెల్లడించింది. ఆ ఆసుపత్రి సిబ్బంది ద్వారా ముందుగా వేల సంఖ్యలో వైద్యులు, నర్సులు కొవిడ్‌పై పోరాడుతున్న ఇతరులకు.. టీకాలు వేయనున్నారని తెలిపింది.

ప్రయోగ దశలో ఉన్న ఈ టీకాకు అనుమతి లభించిన వెంటనే తదుపరి ప్రక్రియ చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని.. ఆ ఆసుపత్రికి ఆదేశాలు అందాయని వివరించింది ది సన్. అయితే నవంబర్‌ 2 నుంచే టీకా పంపిణీ మొదలవుతుందన్న వార్తలను ఎన్​హెచ్​ఎస్​ ధ్రువీకరించలేదు.. ఖండించనూ లేదు. మరోవైపు వచ్చే ఏడాది ప్రథమార్థంలో టీకా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్‌ హన్‌కాక్‌ పేర్కొనడం గమనార్హం.

ఇదీ చూడండి:హ్యూమన్​ ట్రయల్స్​లో ఆక్స్‌ఫర్డ్ టీకా ఫలితాలు ఆశాజనకం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details