12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు తాము తయారు చేసిన టీకాను ఇచ్చేందుకు అనుమతివ్వాలంటూ ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా.. ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థను ఆశ్రయించాయి. 2 వేల మందికిపైగా పిల్లలపై చేసిన అధ్యయనాల్లో తమ టీకా సురక్షితం, ప్రభావవంతమని తేలిందని ప్రకటించాయి. టీకా వల్ల.. పిల్లల్లో మరో రెండేళ్లపాటు దీర్ఘకాలిక రక్షణ వ్యవస్థ మెరుగవుతుందని పేర్కొన్నాయి.
ఈ నిర్ణయాన్ని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాహ్న్ స్వాగతించారు. చిన్నారులకు అందించేందుకు వ్యాక్సిన్‌కు త్వరలోనే అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమోదం లభిస్తే.. టీకా పంపిణీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు.