కొవిడ్-19కు రూపొందుతున్న టీకాల్లో తుది విడత క్లినికల్ ప్రయోగాల ఫలితాలను ప్రచురించిన తొలి సంస్థగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. ఈ వివరాలను మంగళవారం ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌లో ప్రచురించింది. ఫలితంగా వ్యాక్సిన్ ఉత్పత్తి రేసులో కీలక అడ్డంకిని అధిగమించింది. ఈ వ్యాక్సిన్ సురక్షితమేనని.. సగటున 70.4 శాతం సమర్థతను చాటిందని ఆ అధ్యయనం పేర్కొంది.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితమే.. - ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పనితీరు
ప్రపంచ దేశాలు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న కరోనాకు వ్యాక్సిన్ అందించే దిశగా మరింత పురోగతి సాధించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. తుది విడత ప్రయోగాల ఫలితాల్లో 70శాతానికిపైగా సమర్థతతో సురక్షితమేనని తేలింది.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ భేష్
మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన మధ్యంతర విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ఈ ప్రయోగాల్లో 20వేల మందికిపైగా పాల్గొన్నారు. రెండు పూర్తిస్థాయి డోసులు పొందినవారిలో టీకా 62 శాతం సమర్థంగా పనిచేసిందని.. మొదట అరడోసు, ఆ తర్వాత పూర్తి డోసు తీసుకున్న వారిలో 90శాతం సమర్థత కనిపించిందని అధ్యయనం వెల్లడించింది.
ఇదీ చదవండి:'కరోనాను ఎదుర్కొనే సమర్థత ఫైజర్‌కు ఉంది'