తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయ 'చడ్డీస్​'కు ఆక్స్​ఫర్డ్​ డిక్షనరీలో చోటు - బీబీసీ

విశ్వవిఖ్యాత ఆక్స్​ఫర్డ్​ ఆంగ్ల నిఘంటువులో తాజాగా 650 కొత్త పదాలు చేర్చారు. వీటిలో భారతీయ పదం 'చడ్డీస్'​ ఒకటి.

ఆక్స్​ఫర్డ్​ ఆంగ్ల నిఘంటువులో భారతీయ పదం 'చడ్డీస్​'

By

Published : Mar 22, 2019, 7:42 AM IST

ప్రఖ్యాత ఆక్స్​ఫర్డ్​ ఆంగ్ల నిఘంటువులో మరో భారతీయ పదానికి చోటు లభించింది. భారత్​లో విరివిగా వాడే 'చడ్డీ' పదాన్ని 'చడ్డీస్​'గా నిఘంటువులో చేర్చారు. తాజాగా 650 కొత్తపదాలను చేర్చిన ఆక్స్​ఫర్డ్​ ఆంగ్ల నిఘంటువును గురువారం విడుదల చేశారు.

బ్రిటీష్​ పాలనలో భారత్ ఉన్నప్పుడు ప్రభుత్వ గెజిట్​, అలాగే ఇతర ప్రచురణల్లో 'చడ్డీ' పదాన్ని ఉపయోగించేవారు. అయితే ఈ చడ్డీస్​ పదం 1990ల్లో బీబీసీలో ప్రసారమైన బ్రిటిష్​-ఏసియన్​ హాస్య ధారావాహిక 'గుడ్​నెస్​-గ్రేసియస్​ మీ'తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఆక్స్​ఫర్డ్​ నిఘంటువులో 'చడ్డీస్' పదానికి షార్ట్​ ట్రౌజర్లు, షార్ట్స్​, అండర్​ ప్యాంట్స్​ అర్థాలు కనిపించనున్నాయి.


ABOUT THE AUTHOR

...view details