తెలంగాణ

telangana

ETV Bharat / international

నీరవ్​ కోసం లండన్​కు సీబీఐ-ఈడీ బృందం - PNB

నీరవ్​మోదీని భారత్​ రప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి సీబీఐ, ఈడీ. పీఎన్​బీ కుంభకోణానికి సంబంధించిన పత్రాలతో సీబీఐ, ఈడీ అధికారులు లండన్​ వెళ్లనున్నారు.

నీరవ్​ మోదీ

By

Published : Mar 27, 2019, 1:28 PM IST

Updated : Mar 27, 2019, 3:26 PM IST

నీరవ్​ మోదీ
పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​(పీఎన్​బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్​ మోదీని భారత్​ రప్పించే చర్యలను కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ వేగవంతం చేశాయి. రెండు సంస్థలకు చెందిన జాయింట్​​ డైరెక్టర్​ స్థాయి అధికారులతో కూడిన సీబీఐ బృందం సంబంధిత పత్రాలతో లండన్​ వెళ్లనుందని అధికారులు తెలిపారు. నీరవ్​ను భారత్​కు అప్పగించే ప్రక్రియలో లండన్​ అధికారులకు వీరు సహకారం అందించనున్నారు.

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ దరఖాస్తుపై లండన్ వెస్ట్​మినిస్టర్​ మెజిస్ట్రేట్​ న్యాయస్థానం శుక్రవారం వాదనలు విననుంది.

గతవారం సెంట్రల్ లండన్ బ్యాంకులో ఖాతా తెరిచేందుకు వెళ్లిన నీరవ్​ మోదీని పోలీసులు అరెస్టు చేశారు. నీరవ్​ మొదటి బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈనెల 29వరకు కస్టడీ విధించింది.

భారతీయ బ్యాంకులను రూ. 13 వేల కోట్ల మేర మోసగించి, విదేశాలకు పరారయ్యారని నీరవ్​పై అభియోగాలున్నాయి.

Last Updated : Mar 27, 2019, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details