తెలంగాణ

telangana

ETV Bharat / international

పౌరసత్వ చట్ట సవరణపై ఐరాస ఆందోళన - unites nations human rights

భారత్​ పౌరసత్వ చట్టంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రాథమికంగా వివక్షపూరితంగా ఉందని పేర్కొంది. ఈ చట్టాన్ని భారత సుప్రీంకోర్టు సమీక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

citizenship law
నూతన పౌరసత్వ చట్టం ప్రాథమికంగా వివక్షపూరితం'

By

Published : Dec 13, 2019, 10:16 PM IST

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​లో వివక్షకు గురైన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా కేంద్రం తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టంపై ఐరాస మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పౌరసత్వ చట్ట సవరణ.. ప్రాథమికంగా వివక్షపూరితంగా ఉందన్నారు సంఘం అధికార ప్రతినిధి జెరేమి లారెన్స్​.

భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ హక్కును బలహీనపరిచేలా ఈ చట్టం ఉందన్నారు లారెన్స్​. జాతి, మత వివక్షను నిర్మూలించాలనే అంతర్జాతీయ తీర్మాణానికి ఇలాంటి చట్టాలు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

శరణార్థులకు రక్షణ కల్పించడాన్ని తాను స్వాగతిస్తున్నప్పటికీ.. జాతి, మత భేదాలు లేకుండా అందరినీ ఆదుకోవాలన్నారు.నూతన పౌరసత్వ చట్టాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం సమీక్షిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు లారెన్స్.

ఇదీ చూడండి: 'పౌర' సెగ​: బంగాల్​లో రైల్వే స్టేషన్​కు నిప్పు

ABOUT THE AUTHOR

...view details