ఇటీవలే ఓ అబ్బాయికి జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యారు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్. ఆర్చీ అని పేరు పెట్టారు. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా బాబుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను ఆకర్షించింది. ఆ చిన్నారి పాదాలను పట్టుకున్న ఛాయాచిత్రాన్ని తన ఇన్స్టాలో పంచుకుంది మేఘన్.
నెటిజన్లను ఆకట్టుకున్న 'చిన్నారి పాదాలు' - ఆర్చీ
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కూమారుడి ఫొటోను ఇన్స్టాలో పంచుకుంది మేఘన్ మార్కెల్. అది ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
నెటిజన్లను ఆకట్టుకున్న 'చిన్నారి పాదాలు'
"మాతృదినోత్సవం జరుపుకుంటున్న తల్లులందరికి శుభాకాంక్షలు. మేం ప్రతి ఒక్క తల్లిని గౌరవిస్తున్నాం." -ఇన్స్టాలో మేఘన్ మార్కెల్
అంతర్జాతీయ మాతృ దినోత్సవం యూనైటెడ్ స్టేట్స్తో పాటు భారతదేశం, కెనడా ఇలా పలు దేశాల్లో ఆదివారం జరుపుకున్నారు. బ్రిటీష్ మదర్స్ డే మాత్రం ఈ సంవత్సరం మార్చి 31నే జరుపుకున్నారు.