తెలంగాణ

telangana

ETV Bharat / international

కదులుతున్న బస్సుపై కాల్పులు.. ముగ్గురు మృతి - kosovo country news

కదులుతున్న బస్సుపై ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డ్రైవర్​ సహా.. ముగ్గురు మరణించగా.. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

firing
కాల్పులు

By

Published : Nov 27, 2021, 4:49 AM IST

గుర్తుతెలియని సాయుధుడు కదులుతున్న బస్సుపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ఐరోపా దేశమైన కొసోవోలో(kosovo country news) ఈ దారుణం వెలుగుచూసింది. రాజధాని ప్రిస్టినాకు(kosovo capital pristina) 90 కిమీ దూరంలో ఉన్న గ్లోగ్జాన్‌లో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మరణించగా.. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఎనిమిది మందితో వెళ్తున్నఈ బస్సుపై ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దాడికి గల కారణాలు తెలియదని పోలీసులు వివరించారు. "ఇది తీవ్రవాద చర్య అని నమ్మేందుకు ఆధారాలు లేవని" అని ఎల్షానీ అనే పోలీసు అధికారి చెప్పారు.

ఈ దాడి తనను 'షాక్​'కు గురిచేసిందని అధ్యక్షుడు(kosovo president) వ్జోసా ఉస్మానీ తెలిపారు. వీలైనంత త్వరగా నేరస్థులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.

మరోవైపు.. అల్బేనియా పర్యటనలో ఉన్న అంతర్గత వ్యవహారాల మంత్రి జిలాల్ స్వేక్లా(Xhelal Svecla) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details