తెలంగాణ

telangana

ETV Bharat / international

బోరిస్​ బిడ్డకు ఆ వైద్యుల పేర్లు.. కారణం!

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్స్​న్​ ఇటీవల పుట్టిన తన మగబిడ్డకు విల్​ఫ్రెడ్​ లౌరీ నికోలస్​ జాన్సన్​ అనే పేరు పెట్టారు. బోరిస్​ ఇటీవలే వైరస్​పై విజయం సాధించారు. అందుకు సహాయం చేసిన వైద్యుల గౌరవార్థం తన బిడ్డకు వారి పేర్లను కలిపి నామకరణం చేశారు.

Johnson couple names baby after doctors who saved UK PM's life
బోరిస్​ బిడ్డకు ఆ వైద్యుల పేర్లు.. కారణం!

By

Published : May 3, 2020, 8:47 AM IST

బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​కు కాబోయే భార్య క్యారీ సైమండ్స్​ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఆ బిడ్డకు విల్​ఫ్రెడ్​ లౌరీ నికోలస్​ జాన్సన్​ అని నామకరణం చేశారు జాన్సన్​. తమ పూర్వీకులు, వైరస్​పై పోరాడటంలో బోరిస్​కు సహాయం చేసిన వైద్యుల గౌరవార్థం వారి పేర్లు కలిసేలా నామకరణం చేశారు. ఈ విషయాన్ని సైమండ్స్​ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పంచుకున్నారు.

విల్​ఫ్రెడ్​​ బోరిస్​కు​ తాత, లౌరీ సైమండ్స్​కు తాతా. వైరస్​ సోకిన బ్రిటన్​ ప్రధానికి చికిత్స చేసిన ఇద్దరు డాక్టర్ల పేర్లు డా. నిక్​ ప్రైస్​, డా. నిక్​ హార్ట్​. అందుకు నికోలస్​ను పేరులో జత చేశారు.

బ్రిటిష్​ ప్రధాని కార్యాలయంలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు బోరీస్​ జాన్సన్​, సైమండ్స్​. బోరిస్​ జాన్సన్ సారథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఒకప్పుడు కమ్యూనికేషన్​ చీఫ్​గా వ్యవహరించారు సైమండ్స్​. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారట.

ఇప్పటికే జాన్సన్​ రెండో భార్య మరీనా వీలర్​కు నలుగురు పిల్లలు. 1993లో పెళ్లి చేసుకున్న వారిద్దరూ.. 2018లో విడిపోయి వేరుగా ఉంటున్నారు. అంతకుముందు... 1987లో అలెగ్రా మోస్టిన్​ ఓవెన్​ను వివాహం చేసుకున్నారు బోరిస్. తర్వాత కొన్నేళ్లగా విడిపోయారు.

ABOUT THE AUTHOR

...view details