బ్రిటన్‌పై ఇరాన్ మండిపడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒమన్ సమీపంలోని రెండు చమురు నౌకలపై దాడికి తామే కారణమని బ్రిటన్ ఎలా ఆరోపిస్తుందని ప్రశ్నించింది.
ఈ మేరకు ఇరాన్‌లోని బ్రిటన్ రాయబారి రాబ్ మెకైర్కు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. బ్రిటన్ విదేశాంగ శాఖ తప్పుడు, అవాస్తవమైన ఆరోపణలు చేస్తోందని నోటీసులో పేర్కొంది.
బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి జెరేమీ హంట్ ఓ ప్రకటనలో ఒమన్ సమీపంలోని చమురు నౌకలపై దాడి చేసింది ఇరాన్ దేశమే అని అభిప్రాయపడ్డారు.