బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేగన్... ససెక్స్ రాయల్స్ పేరుతో ఇన్‌స్టా అకౌంటును ప్రారంభించారు. ఇది 6 గంటల్లోనే ఒక మిలియన్ ఫాలోవర్లను సంపాదించింది. ఇంతకుముందు ఈ రికార్డు కొరియన్ పాప్ సింగర్ కాంగ్ డేనియల్ పేరిట ఉండేది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రిన్స్ హ్యారీ, మేగన్ రికార్డు - prince harry
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, మేగన్ జంట గిన్నిస్ రికార్డును సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ ఫాలోవర్లను సంపాందించుకున్న అకౌంట్‌గా ఘనత సాధించింది.
హారీ, మేగన్
రాకుమారుడి అధికారిక ఖాతా అయినందున అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చారు. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏప్రిల్ చివర్లో లేదా మే లో బిడ్డకు జన్మనివ్వబోతుంది మేగన్.
ఇవీ చూడండి..తెరపైకి విజయ్ తమ్ముడు, రాజశేఖర్ కూతురు