తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆదర్శ గృహాల్లో ఆనందంగా గడిపేయండి - గృహం

లండన్​లో ద ఐడియల్ హోమ్ షో(ఆదర్శ గృహాల ప్రదర్శన) అట్టహాసంగా జరిగింది. విభిన్న రీతుల్లో నిర్మించిన గృహాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. గృహాల స్థాయిని బట్టి లక్షా 32వేల డాలర్ల నుంచి 10లక్షల 32వేల డాలర్ల వరకు ధర నిర్ణయించారు.

ది ఐడియల్ హోమ్​ షో

By

Published : Mar 25, 2019, 4:21 PM IST

Updated : Mar 25, 2019, 8:16 PM IST

ఆకట్టుకుంటోన్న ఆదర్శగృహం
సొంతిల్లు... ప్రతి ఒక్కరి జీవితంలో కల. ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి మంచి గృహాన్ని ఎంచుకోవాలనుకుంటారు. ఇలాంటి వారి కోసం లండన్​లో దఐడియల్ హోమ్ షో(ఆదర్శ గృహాల ప్రదర్శన)నిర్వహిస్తున్నారు. ఆ నెల 22న ప్రారంభమైన ప్రదర్శన 17 రోజుల పాటు లండన్ కింగ్​స్టన్ ఒలింపియా ఎగ్జిబిషన్​ సెంటర్​లో జరగనుంది.

మారుతున్న సాంకేతికతకు తగ్గట్టు, పర్యావరణహిత ఇళ్లను రూపొందించారు. దఎవాల్వింగ్ హౌస్ గా పిలిచే ఈ గృహం 2వేల 210 చదరపు అడుగుల్లో నిర్మితమైంది. పనికి రాని వస్తువులను రీ డిజైన్ చేసి ఉపయోగించారు. ఎక్కువ కాలం మన్నిక వచ్చే మెటీరియల్స్​ని ఇందులో వాడారు.

"ఈ ఇంట్లోని గదులన్నీ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు విభిన్నంగా రూపొందించారు. ఈ రోజుల్లో ప్రజలు ఒకే రకంగా ఉండేందుకు ఇష్టపడట్లేదు. అన్నిట్లో వైవిధ్యం కోరుకుంటున్నారు." -- సైమన్ గోర్డన్, ఇంటిరీయర్ డిజైనర్.

ఇంట్లో సాయపడేందుకు ఓ రోబో​​నీఏర్పాటు చేశారు. మనకు తెలియని విషయాలను దీన్ని అడిగి తెలుసుకోవచ్చు. ట్రెండ్​కు తగ్గట్టుగా రూపొందించిన బెడ్​రూమ్​తో విపరీతంగా ఆకర్షిస్తోందీ గృహం.

"దీని పేరు టెమీ. ఇంట్లో మీకు సాయపడేందుకు ఈ రోబోని రూపొందించాం. అంతర్జాలంలో మీకు తెలియని విషయాలను దీని ద్వారా తెలుసుకోచ్చు. ఉదాహరణకు టెమీ వెదర్ అంటే ఏమిటి? చూశారా ఎలా ప్రతిస్పందించిందో" -- ఫ్యాబ్రిస్​ గొఫిన్​, జోరా రోబోటిక్స్ సహ సీఈఓ

విభిన్న రకాల్లో రూపొందించిన ఈ గృహల ధరను స్థాయిని బట్టి లక్షా 32వేల డాలర్లనుంచి 10లక్షల 32వేల డాలర్ల వరకు నిర్ణయించారు.

Last Updated : Mar 25, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details