బ్రిటన్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ తొలిసారి జంటగా ఓ కార్యక్రమానికి హాజరైనట్లు బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది. మియామీలో జరిగిన జేపీ మోర్గాన్ ఛేజ్ కార్యక్రమంలో హ్యారీ, మేఘన్‌లు పాల్గొన్నట్లు పేర్కొంది.
అమెరికాలో అత్యధిక ఆస్తులు కలిగిన బ్యాంకుగా జేపీ మోర్గాన్ ఛేజ్కు పేరుంది. దక్షిణ మియామీ బీచ్‌లోని ఓ హోటల్లో హ్యారీ ప్రసంగించినట్లు తెలుస్తుండగా.. ఇందుకోసం ఏమైనా డబ్బులు స్వీకరించారా అన్న విషయమై స్పష్టత లేదని సమాచారం.
స్వతంత్రంగా జీవించాలన్న ఉద్దేశంతో హ్యారీ,మేఘన్‌లు గత నెలలో బ్రిటన్ రాజప్రాసాదాన్ని వదిలి కెనడాకు పయనమయ్యారు. ప్రస్తుతం కెనడా పశ్చిమ తీరంలోని విక్టోరియా సమీపంలో విలాసవంతమైన భవనంలో కాలం గడుపుతున్నారు.