గ్రీసులో తుపాను బీభత్సం- ఏడుగురు మృతి గురువారం ఉత్తర గ్రీస్‌లో తుపాను పెనుబీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో చిక్కుకుని ఆరుగురు పర్యటకులు, ఓ మత్స్యకారుడు మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం.
పర్యటకులను పొట్టనబెట్టుకుంది...
ఉత్తర గ్రీసులో పర్యటన కోసం వచ్చిన ఆరుగురు విదేశీయులు ఈ తుపానులో చిక్కుకుని మరణించారు. వీరిని రష్యా, చెక్ రిపబ్లిక్, రొమేనియాకు చెందిన పర్యటకులుగా గుర్తించారు.
గతేడాది ఏథెన్స్ సమీపంలోని అడవికి కార్చిచ్చు అంటుకుని 100 మరణించిన తరువాత.... మళ్లీ అంత పెద్ద విపత్తు ఇదే. గ్రీసులో తరచుగా వస్తున్న ఈ వాతావరణ విపత్తులపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: వాణిజ్య వివాదాలపై నేడు భారత్-అమెరికా చర్చలు