ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4.80 కోట్లు దాటింది. 12.23 లక్షల మందికిపైగా మరణించారు. అమెరికా, బ్రెజిల్, రష్యాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది.
కరోనా విజృంభణ
By
Published : Nov 4, 2020, 9:02 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజుకు దాదాపు 5 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.80 కోట్లు దాటింది. నేపాల్‌లో కొత్తగా 3వేలకుపైగా కేసులు వచ్చాయి. అమెరికా, బ్రెజిల్‌తో పాటు రష్యాలోనూ వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.
మొత్తం కేసులు: 48,030,398
మరణాలు: 1,223,172
కోలుకున్నావారు: 34,465,901
యాక్టివ్ కేసులు: 12,341,325
అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఎన్నికల వేళ రోజు వారి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 70వేల నుంచి 90 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 97 లక్షలకు చేరువైంది.
రష్యాలో కొత్తగా 19,768 మందికి వైరస్ సోకింది. 389 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది.
నేపాల్‌లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కొత్తగా 3,309 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కాఠ్మండు లోయలోనే 1,878 కేసులు నమోదు కావటం ఆ ప్రాంతంలో ఆందోళన కలిగిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,82,923కు చేరింది. దేశవ్యాప్తంగా బుధవారం 12,144 టెస్టులు నిర్వహించారు.