తెలంగాణ

telangana

ETV Bharat / international

85 మందిని బలిగొన్న నర్సుకు జీవిత ఖైదు - Niels Hoegel

మహేష్​బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా గుర్తుందా... దాంట్లో విలన్ బాల్యం నుంచే మనుషులను చంపి ఆ చావులు చూసి ఆనందిస్తుంటాడు. ఇది సినిమా. కానీ నిజ జీవితంలో ఇలా జరిగితే... జరిగితే ఏంటి జరిగింది. జర్మనీలో 85 మందిని పొట్టనబెట్టుకున్న నరహంతకుడు నీల్స్​ హెగెల్​ చివరకు పాపం పండి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

85 మందిని బలితీసుకున్న నర్సుకు జీవిత ఖైదు

By

Published : Jun 6, 2019, 9:14 PM IST

85 మందిని బలితీసుకున్న నర్సుకు జీవిత ఖైదు

రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన నరహంతకుడు వాడు. పవిత్రమైన నర్సు వృత్తిలో ఉండి, బోరుకొట్టినపుడల్లా సరదా కోసం రోగుల ప్రాణాలను తీశాడు. ఇలా వరుస హత్యలకు పాల్పడుతూ సుమారు 85 మంది రోగుల ప్రాణాలు తీశాడు. పాపం పండి పోలీసులకు చిక్కాడు. న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

జర్మనీకి చెందిన 42 ఏళ్ల నీల్స్​ హెగెల్ ​నర్సుగా పనిచేస్తుండేవాడు. 2000 నుంచి 2005 సంవత్సరాల మధ్య వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఓ ఆరు హత్యలకు పాల్పడిన కేసులో ఇప్పటికే ఈ హంతకుడు పదేళ్ల శిక్షను కూడా అనుభవించాడు.

హంతకుని చర్యలు ఊహాతీతం..

కిరాతకుడు నీల్స్​ హెగెల్​ చేసిన హత్యలను నిరూపించడానికి సుమారు 130 మందికి శవపరీక్షలు చేశారు. అయితే ఇతను 200కు పైగా హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసును విచారించిన ఓల్డెన్​బర్గ్​లోని బ్యూర్మన్​ ప్రాంతీయ న్యాయస్థానం హంతకుని చర్యలు మానవ ఊహకు అతీతంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. నిందితునికి జీవిత ఖైదు విధించింది.

క్షమించండి..

శిక్ష పడిన అనంతరం హంతకుడు నీల్స్ హెగెల్​ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాడు.

గొప్పల కోసం..

నీల్స్​ హెగెల్​ సరదా కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడేవాడు. రోగులకు ప్రాణాంతకమైన ఇంజక్షన్లు ఇచ్చేవాడు. వారు ప్రాణాలకోసం ఆరాటపడుతుంటే రక్షించడానికి ప్రయత్నించేవాడు. ప్రయత్నం సఫలమై, అందరూ పొగుడుతుంటే ఆనందపడేవాడు. ఒక వేళ రోగి ప్రాణాలు కోల్పోతే, తనకు ఏమీ తెలియనట్లు ప్రవర్తించేవాడు. అయితే ఈ దుర్మార్గుడి వల్ల ఎక్కువ మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.

ఇలా దొరికిపోయాడు..

నీల్స్​ హెగెల్​.. 2005లో ఇలానే ఓ రోగికి డాక్టర్లు సూచించని ఇంజక్షన్​ వేస్తూ పడ్డుబడ్డాడు. ఈ హత్యాయత్నం కేసులో అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ ఘటనతో హంతకుని దురాగతాలు అన్నీ బయటపడ్డాయి.

2000 ఫిబ్రవరి 7 మొదలు పెట్టిన హత్యాకాండ.. సుమారు 85 ప్రాణాలు తీసేంతవరకు సాగింది. నిజానికి ఈ హత్యల సంఖ్య 200కు పైగా ఉండొచ్చని పోలీసుల అంచనా.
చివరకు బాధిత కుటుంబాల ఒత్తిడితో ఈ నరరూప రాక్షసుడి హత్యలపై... విచారణ జరిగి తాజాగా జీవిత ఖైదు పడింది.

స్వయం మోహితుడు..

సైక్రియాట్రిస్ట్ మాక్స్​ స్టెల్లర్​ ప్రకారం హంతకుడు నీల్స్​ హెగెల్ 'తీవ్రమైన స్వయంమోహిత రుగ్మత'తో బాధపడుతున్నాడు. ​అంటే తను అందరిచేత పొగడబడలాని, తాను అందరి దృష్టిలో గొప్పవాడు అనిపించుకోవాలని తాపత్రయపడ్డాడని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: మమతా బెనర్జీ కోసం రంగంలోకి ప్రశాంత్​ కిషోర్​!

ABOUT THE AUTHOR

...view details