తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రాన్స్‌లో జులై 24 వరకు ఆరోగ్య అత్యయిక స్థితి

ఫ్రాన్స్​లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న తరుణంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని జులై 24 వరకు పొడిగించింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఒలివియర్​ ప్రకటన విడుదల చేశారు.

France reports lowest daily virus toll in five weeks
ఫ్రాన్స్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ పొడిగింపు

By

Published : May 2, 2020, 7:05 PM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (హెల్త్‌ ఎమర్జెన్సీ) పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. జులై 24 వరకు పొడిగిస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఒలివియర్‌ వెరన్‌ వెల్లడించారు.

ఫ్రాన్స్​లో ఇప్పటి వరకు లక్షా 67 వేల 346 మందికి వైరస్ సోకింది. 24,594 మంది మృతి చెందారు. 50,212 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details