తెలంగాణ

telangana

ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్​లో తగ్గిన మరణాలు

By

Published : May 2, 2020, 7:34 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 34 లక్షలు దాటింది. ఇప్పటివరకు 2 లక్షల 39 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో 10 లక్షల 81 వేల మందికిపైగా కోలుకున్నారు. ఫ్రాన్స్​లో కరోనా మరణాల సంఖ్య భారీగా తగ్గింది. అమెరికాలో 24 గంటల వ్యవధిలో మరో 1883 మంది మరణించినట్లు జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ వెల్లడించింది.

France reports lowest daily virus toll in five weeks
శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్​లో తగ్గిన మరణాలు

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్​ కాస్త శాంతిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 34 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 2 లక్షల 39 వేల మందికిపైగా మరణించారు. కొవిడ్​ తీవ్ర ప్రభావం చూపిన ఐరోపా దేశాల్లో మళ్లీ మరణాల సంఖ్య తగ్గుతోంది.

ఫ్రాన్స్​లో శుక్రవారం 218 మంది మరణించారు. గత 5 వారాల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. కొత్త కేసులు 168 మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మే 11 నుంచి లాక్​డౌన్​ నిబంధనలు సడలించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

24 గంటల వ్యవధిలో ఇటలీలో 269, స్పెయిన్​లో 281 మంది మరణించారు. వరుసగా ఆ దేశాల్లో 1965, 3648 కొత్త కేసులు వెలుగుచూశాయి. యూకేలో మరో 739 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 27 వేల 510కి చేరింది.

అమెరికాలో భారీగానే...

అమెరికాలో మరో 36 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1883 మంది కొవిడ్​కు బలయ్యారు. దేశంలో మొత్తం కరోనా మరణాలు 65 వేలను మించాయి. ఇప్పటివరకు 11 లక్షల 31 వేలమందికిపైగా వైరస్​బారిన పడ్డారు.

  • జర్మనీలో శుక్రవారం నాడు 113 మంది చనిపోగా.... రష్యాలో 96 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కేసుల సంఖ్య లక్షా 14 వేలు దాటింది.
  • బెల్జియంలో మరో 109 మంది, నెదర్లాండ్స్‌లో 98 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కెనడాలో గడచిన 24 గంటల్లో 207 మంది చనిపోగా, మెక్సికోలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రపంచంలో మరో పెద్ద హాట్​స్పాట్‌గా మారిన బ్రెజిల్‌లో శుక్రవారం నాడు 509 మంది చనిపోగా, ఈక్వెడార్‌లో 163 మంది ప్రాణాలు విడిచారు.
  • పాకిస్థాన్‌లో మొత్తం బాధితులు 18 వేల 92కి చేరారు. ఇప్పటివరకు 417 మంది చనిపోయారు

ABOUT THE AUTHOR

...view details