గత మూడు రోజులుగా కొనసాగుతున్న వరద ఉద్ధృతికి ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్-మారిటైమ్ కొండప్రాంతాలు, ఇటలీలోని లిగురియా, పీడ్‌మోంట్ ప్రాంతాలు నీటమునిగాయి. వరదల బీభత్సానికి ఇప్పటివరకు 12 మంది మరణించారు.
ఫ్రాన్స్, ఇటలీని ముంచెత్తుతున్న వరదలు - floods in france and italy
వరదల బీభత్సానికి ఫ్రాన్స్, ఇటలీ దేశాల సరిహద్దు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. సోమవారం.. ఫ్రాన్స్ సరిహద్దులో మరో మూడు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. దీంతో వరద ధాటికి మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. గల్లంతైన 20 మంది కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.
ఫ్రాన్స్, ఇటలీని ముంచెత్తుతున్న వరదలు
వరదల్లో చిక్కుకున్న బాధితులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వరద బీభత్సానికి రహదారులు స్తంభించటంతోపాటు, సాంకేతిక సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సహాయం చేయవలసిందిగా లిగురియా, పీడ్‌మోంట్ రాష్ట్రాల గవర్నర్లు ఇటలీ ప్రభుత్వాన్ని కోరారు.