ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాల వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. ఈ రెండు దేశాల మధ్య ఆదివారం జరిగిన పోరులో 16 మంది చనిపోగా సోమవారం 21 మందికి పైగా మృతి చెందారు. తమ దేశానికి చెందిన ఆరుగురు పౌరులు మృత్యువాత పడినట్లు... 19 మంది గాయాలపాలైనట్లు అజర్‌బైజాన్ తెలిపింది. ఈ క్రమంలో 15 మందికి పైగా తమ సైనికులు చనిపోయినట్లు నాగోర్నో- కరాబాఖ్ మద్దతు కలిగిన ఆర్మేనియా బలగాలు ప్రకటించాయి. దీంతో పాటు ఆదివారం జరిగిన ఘర్షణలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతానికి ఉత్తర భాగాన ఉన్న అజర్‌బైజాలోని అజేరీ పట్టణాన్ని ఆర్మేనియా బలగాలు చుట్టుముట్టినట్లు అజర్‌బైజాన్ రక్షణ శాఖ తెలిపింది.
ఆర్మేనియా- అజర్‌బైజాన్ మధ్య భీకర పోరు - అజర్‌బైజాన్ మృతులు
ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. ఈ ఘర్షణలో 21మంది మరణించారు.
ఈ నేపథ్యంలో కారాబాఖ్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను తమ సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఈ దేశాల మధ్య 2016 లోనూ ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో దాదాపు 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది జులై నెలలో జరిగిన పోరులోనూ 16 మంది మరణించారు. నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతం భౌగోళికపరంగా అజర్‌బైజాన్ దేశంలో ఉంది. అయినా అజర్‌బైజాన్ విధానాలను వ్యతిరేకించే ఆర్మేనియా బలగాలే ఎప్పటి నుంచో దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఇదీ చూడండి:-క్వారంటైన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ. 95 వేలు జరిమానా!