యూరప్‌లో కరోనా ఉద్ధృతి మళ్లీ (europe coronavirus rise) పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 6 శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మంది కరోనా బారిన పడి మృతి చెందనున్నట్లు డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ డా. హాన్స్ క్లజ్ తెలిపారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియంలు తాజాగా లాక్డౌన్లను కూడా విధించాయి. జర్మనీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. లక్ష మరణాల మార్క్‌ను ఆ దేశం ఈ వారం దాటనుంది. కరోనా టీకా వేసుకోవాలని అక్కడి రాజకీయ నాయకులు పిలుపునిస్తున్నారు. అటు.. యూరప్‌లో ఇప్పటివరకు 100 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
చెక్ రిపబ్లిక్‌లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి (europe covid cases news). ప్రతిరోజు 26 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ వ్యాప్తి పెరగగా.. టీకా తప్పకుండా వేసుకోవాలని పౌరులకు ప్రభుత్వం సూచిస్తోంది. తాజా పరిణామాలతో వైరస్‌ను కట్టడి చేసే ప్రణాళికను ప్రభుత్వం త్వరలో విడుదలచేయనుంది.