మూడేళ్లుగా బ్రిటన్ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న బ్రెగ్జిట్ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు కనపడుతోంది. గురువారం జరగనున్న ఐరోపా సమాఖ్య సమావేశంలో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ఈయూ వర్గాలు తెలిపాయి.
బ్రెగ్జిట్ ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఈయూ అధికారులు తరచూ సంప్రందింపులు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రమూ ఆయనతో సమావేశమయ్యారు. ఒప్పందంలో పలు కీలక విషయాలపై చర్చించారు. అయితే ఒప్పందం కుదుర్చుకోవాలంటే బ్రిటన్ అనేక విషయాల్లో రాజీపడాల్సిన పరిస్థితి నెలకొంది.
అక్టోబరు 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాలి. ఈ తేదీకి ముందు ఈయూ.. గురువారం నిర్వహించే సమావేశమే చివరిది.
బ్రెగ్జిట్ ఒప్పందంపై సానుకుల ప్రభావంతో బ్రిటన్ పౌండ్ విలువ గత కొద్ది రోజులుగా వృద్ధి చెందుతోంది.