బ్రిటన్ పార్లమెంటు సమావేశాలను అక్టోబర్ 14 వరకు రద్దు చేయాలన్న ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వినతికి ఎలిజబెత్ రాణి-2 ఆమోదం తెలిపారు. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు అక్టోబర్ 31 వరకు తుది గడువు ఉంది. ఈ మేరకు సరికొత్త శాసన అజెండాను రూపొందించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని జాన్సన్ నిర్ణయించారు.
బోరిస్ నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. బ్రెగ్జిట్‌పై చర్చ చేపట్టకుండా నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో దుయ్యబట్టారు. ఇది రాజ్యాంగపరమైన దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.