తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూకే, ఐరోపా​ల్లో 'బ్రిడ్జ్​ ఇండియా' ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో అధిక శాతం ప్రవాస భారతీయులు, తమ ఓటు హక్కు వినియోగించడంలో ఉన్న పరిమితులు తొలగించాలని అభిప్రాయపడ్డారు.

By

Published : Apr 10, 2019, 9:21 AM IST

'ఓటు హక్కుపై పరిమితులు వద్దు'

భారత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఉన్న పరిమితులపై ప్రవాస భారతీయులు (ఎన్​ఆర్​ఐలు) అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం, యూకే, ఐరోపాల్లోని ప్రవాస భారతీయులు వారి స్థానిక కాన్సులేట్లు, రాయబార కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

భారత సాధారణ ఎన్నికల నేపథ్యంలో గత నెలలో యూకేలోని 'బ్రిడ్జ్​ ఇండియా' సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువ మంది ప్రవాస భారతీయులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారత్​లోని తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేశారు.

పరిమితులు వద్దు...

'బ్రిడ్జ్​ ఇండియా' సర్వేలో ప్రస్తుతమున్న ఓటింగ్​ పద్ధతిని కేవలం 6 శాతం ప్రవాసులే సమర్థించారు. 61 శాతం ప్రవాసులు స్థానిక కాన్సులేట్లు, రాయబార కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. మరో 17 శాతం మంది తమ ప్రతినిధుల ద్వారా ఓట్ల హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలన్నారు.

ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలన్న వాదనకు 60 శాతం మంది అనుకూలంగా స్పందించారు. అయితే ప్రస్తుతానికి భారత్​లో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదు.

రాజకీయాలపై ఆసక్తి ఉంది..

గత నెలలో 'బ్రిడ్జ్​ ఇండియా' 350 మంది ప్రవాసులను సర్వే చేసింది. వీరిలో 1/3 వంతు మంది నాన్ రెసిడెంట్​ ఇండియన్​ (ఎన్​ఆర్​ఐ)లు కాగా, 2/3 వంతు మంది ఓవర్సీస్ సిటిజన్స్​ ఆఫ్​ ఇండియా (ఓసీఐ)లు.

వీరిలో 20 శాతం మంది రాజకీయాలపై ఆసక్తి లేదనగా, మరో 22 శాతం మంది రాజకీయాలపై తటస్థ వైఖరి ప్రదర్శించారు. 29 శాతం ప్రవాసులు మాత్రం రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు.

ఇదీ చూడండి: ఓట్ల కోసం.. కోట్లు కుమ్మరిస్తోన్న నేతలు!

ABOUT THE AUTHOR

...view details