భారత్‌కు అందించాల్సిన మిగిలిన ఆరు రఫేల్ యుద్ధ విమానాలను (Rafale jets latest news) 2022 ఏప్రిల్ నాటికి సరఫరా చేస్తామని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తెలిపారు. కరోనాతో పరిశ్రమలు మూతపడినప్పటికీ గడువులోగా విమానాలను అందించడానికి వర్కర్లు రాత్రుళ్లు, సెలవు దినాల్లో కూడా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఫ్రాన్స్ గౌరవానికి సంబంధించిన విషయంగా ఆయన పేర్కొన్నారు.
'2022 ఏప్రిల్ నాటికి రఫేల్ ఒప్పందం పూర్తి' - రఫేల్ న్యూస్
2022 ఏప్రిల్ నాటికి భారత్‌కు అందించాల్సిన (Rafale jets latest news) మిగిలిన ఆరు రఫేల్ యుద్ధ విమానాలను కూడా అప్పగిస్తామని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తెలిపారు. ఒప్పందంలో భాగంగా 36 విమానాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటివరుకు 30 విమానాలు భారత్‌కు చేరాయి.
రఫేల్ న్యూస్
భారత వాయుసేనను పటిష్ఠం చేయడంలో (Rafale jets news) భాగంగా 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.59 వేల కోట్లు. విమానాలను దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తోంది. ఇప్పటివరకు 30 రఫేల్ యుద్ధ విమానాలను భారత్‌కు చేరాయి.
ఇదీ చదవండి;'దేశ ప్రయోజనాల' కోసం ఉగ్రవాదిని విడుదల చేసిన పాక్!