తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ పార్లమెంట్​ సస్పెన్షన్​ చట్టవిరుద్ధం: సుప్రీం

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్ ఒప్పందం​ అమలు కోసం పార్లమెంట్​ను సస్పెండ్​ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది యూకే సుప్రీంకోర్టు. ఇది చట్టవిరుద్ధమని చారిత్రక తీర్పు వెలువరించింది.

బోరిస్​ జాన్సన్​కు గట్టి ఎదురుదెబ్బ

By

Published : Sep 24, 2019, 4:37 PM IST

Updated : Oct 1, 2019, 8:17 PM IST

బ్రెగ్జిట్​ ఒప్పందం అమలు కోసం ప్రధాని బోరిస్​ జాన్సన్...​ పార్లమెంట్​ను సస్పెండ్​ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది బ్రిటన్ సుప్రీంకోర్టు. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని చారిత్రక తీర్పు వెలువరించింది.

బ్రెగ్జిట్​కు వ్యతిరేకంగా చర్చ జరగకుండా ఈ నెల ప్రారంభంలో పార్లమెంట్​ను 5 వారాల పాటు సస్పెండ్ లేదా ప్రోరోగ్​​ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జాన్సన్​. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ విడిపోయే అక్టోబర్​ 31 తుది గడువు నుంచి తప్పించుకోవడానికే బోరిస్​ జాన్సన్​ ఇలా చేశారని పలువురు విపక్ష ఎంపీలు, సొంత కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఇతర పార్లమెంట్​ సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పార్లమెంటు పరిశీలించకుండా ఎలా ముందుకెళతారని ప్రశ్నించారు.

భారత సంతతికి చెందిన బ్రెగ్జిట్​ వ్యతిరేక ప్రచారకర్త జీనా మిల్లర్​ ప్రధాని నిర్ణయాన్ని యూకే హైకోర్టులో సవాలు చేశారు. అయితే ఈ అంశాన్ని హైకోర్టు... అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేసింది.

బ్రిటన్​ సుప్రీంకోర్టు అధ్యక్షురాలు లేడీ బ్రెండా హేల్​ పార్లమెంట్​ వాయిదా అనేది చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య ప్రాథమిక అంశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని తీర్పులో పేర్కొన్నారు. 11 మంది న్యాయమూర్తులు పార్లమెంట్​ సస్పెన్షన్​ను ఏకగ్రీవంగా తిరస్కరించారని తెలిపారు. హౌస్​ ఆఫ్​ కామన్స్​, లార్డ్స్​ స్పీకర్లు తదుపరి ఏం చేయాలనేది నిర్ణయిస్తారని వెల్లడించారు.

ప్రస్తుతం.. ఐరాస సర్వసభ్య సమావేశాల కోసం అమెరికాలో ఉన్న జాన్సన్​కు ఇదో పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. అయితే... రాజకీయాంశాల్లో కోర్టుల జోక్యం ఉండకూడదని ఆయన వాదిస్తున్నారు.

Last Updated : Oct 1, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details