తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనాతో వృద్ధులకు చెప్పుకోలేని భయం, బాధ'

వృద్ధులపై కరోనా ప్రభావానికి సంబంధించి 16 పేజీల ప్రకటన విడుదల చేశారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్​. కరోనా మహమ్మారి వృద్ధులకు చెప్పుకోలేని భయం, బాధను కలిగిస్తోందని వెల్లడించారు.

COVID-19 pandemic causing untold fear and suffering: UN secretary-general
'కరోనాతో వయో వృద్ధులకు చెప్పుకోలేని భయం, బాధ'

By

Published : May 2, 2020, 5:46 PM IST

కరోనా మహమ్మారి వృద్ధులకు చెప్పుకోలేని భయం, బాధను కలిగిస్తోందని వెల్లడించారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్​. ప్రధానంగా 80ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్యలు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వృద్ధులపై కరోనా ప్రభావానికి సంబంధించి 16 పేజీల ప్రకటన విడుదల చేశారు గుటేరస్​. ఇతరుల్లాగే ఆరోగ్యకరమైన జీవితంతో గడిపేందుకు వృద్ధులకు కూడా సమాన హక్కుందని స్పష్టం చేశారు. అందుకే వీరి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు గుటేరస్​.

అత్యధికులు వృద్ధులే

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాతో ఇప్పటివరకు 2.39లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక శాతం వృద్ధులే ఉన్నారు. అప్పటికే.. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 60ఏళ్లు దాటినవారిని వైరస్​ బారి నుంచి కాపాడుకునేందుకు వారి కుటుంబ సభ్యులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేందుకు వీల్లేదని నిర్బంధిస్తున్నారు.

ఇదీ చూడండి : ప్రభుత్వ 'కరోనా అక్రమాల'కు నిరసనగా సైకిల్ ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details