తెలంగాణ

telangana

ETV Bharat / international

COP26 summit: భారత్​లో గ్రీన్​ ఎనర్జీ అభివృద్ధికి బ్రిటన్ మద్దతు

'గ్రీన్ గ్యారెంటీ ఫైనాన్సింగ్' కింద భారత్​లో చేపట్టనున్న పలు కాలుష్యరహిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. దీనికింద ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులను అందించనున్నట్లు తెలిపింది. గ్లాస్గోలో ప్రపంచ వాతావరణ సదస్సులో ఈ మేరకు ప్రకటించింది.

GREEN
గ్రీన్

By

Published : Nov 1, 2021, 9:39 PM IST

Updated : Nov 1, 2021, 11:38 PM IST

భారత్​లో చేపట్టనున్న 'గ్రీన్ ప్రాజెక్ట్‌ల' కోసం అవసరమయ్యే మొత్తంలో 750 మిలియన్ పౌండ్లను అదనంగా అందించేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఈ మేరకు 'ఇండియా గ్రీన్ గ్యారెంటీ' పేరిట ప్రపంచ బ్యాంకుకు గ్యారంటీ ఇవ్వనున్నట్లు గ్లాస్గోలో జరుగుతున్న ప్రపంచ వాతావరణ​ సదస్సు(కాప్​26) వేదికగా ప్రకటించింది.

గ్రీన్ గ్యారెంటీ ఫైనాన్సింగ్ కింద.. క్లీన్ ఎనర్జీ, ట్రాన్స్‌పోర్ట్, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి రంగాలలో కాలుష్యరహిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అంతేగాకుండా భారత్​లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు చేయూతను అందిచనున్నట్లు ప్రకటించింది. దీనికోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రైవేట్ రంగ మౌలిక సదుపాయాల కోసం 210 మిలియన్ పౌండ్లకు పైగా నూతన పెట్టుబడులు వెచ్చించనున్నట్లు హామీనిచ్చింది.

"బ్రిటన్​లో వచ్చిన గ్రీన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్​ను ప్రపంచవ్యాప్తంగా చూడాలనుకుంటున్నా. క్లీన్ టెక్నాలజీకి సంబంధించి మౌలిక సదుపాయాలు పుంజుకోవడం శుభపరిణామం. అయితే భూమిని వాతావరణ కాలుష్యం నుంచి రక్షించే రేసులో ఏ దేశమూ వెనుకబడి ఉండకూడదు"

---బోరిస్ జాన్సన్, బ్రిటిష్ ప్రధాని

ఈ సదస్సులో భాగంగా యాక్షన్ అండ్ సాలిడారిటీ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనిలో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. 'అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం, అందరికీ గ్రీన్ టెక్నాలజీ, వాతావరణ సంక్షోభానికి ఇతర పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని' ఉద్ఘాటించారు.

క్లీన్ గ్రీన్ ఇనిషియేటివ్..

మరోవైపు.. కాప్26 సదస్సులో భాగంగా "క్లీన్ గ్రీన్ ఇనిషియేటివ్"ను ప్రారంభమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు హరిత సాంకేతికతను సద్వినియోగం చేసుకొనేందుకు, ఆయా ఆర్థిక వ్యవస్థల స్థిర అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం దోహదం చేయనుంది. బ్రిటన్ ప్రభుత్వం ప్రారంభించిన క్లీన్ గ్రీన్ ఇనిషియేటివ్(సీజీఐ) దీనికి సహాకారం అందించనుంది.

"ఆర్థిక వృద్ధి, నాగరిక అభివృద్ధి వంటి అంశాల మధ్య వాతావరణం నిశ్శబ్ద బాధితురాలిగా మారింది. అయితే ఇప్పుడు దీనికి విరుద్ధంగా దూరంగా జరగాల్సిన సమయం ఆసన్నమైంది. క్లీన్ గ్రీన్ ఇనిషియేటివ్ ద్వారా దీనిని పునరుద్ధరిస్తాం. ప్రపంచ భవిష్యత్తు కోసం మేం సహాయం చేస్తాం."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

భారత్​తో పాటు.. ఆఫ్రికాలోనూ వాతావరణ సంబంధిత ప్రాజెక్టులలో పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

"ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిజాయితీ, బాధ్యతాయుతమైన పెట్టుబడి ద్వారా.. మౌలిక సదుపాయాలను అందించాలి. మిత్రదేశాలతో కలిసి పని చేయడం ద్వారా నూతన కార్యక్రమ లక్ష్యాలను సాధిస్తాం."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

ఇవీ చదవండి:

Last Updated : Nov 1, 2021, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details