తెలంగాణ

telangana

ETV Bharat / international

పర్యావరణ పురస్కారం తిరస్కరించిన గ్రెటా థెన్​బెర్గ్​

స్వీడన్ పర్యావరణవేత్త గ్రెటా థెన్​బెర్గ్..​ ప్రతిష్టాత్మక పర్యావరణ పురస్కారాన్ని తిరస్కరించారు. అధికారంలో ఉన్న వారు పర్యావరణ పరిరక్షణకు పాడుపడాలని ఆమె కోరారు. అవార్డులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పర్యావరణ పరిరక్షణ కాదని వ్యాఖ్యానించారు.

పర్యావరణ పురస్కారం తిరస్కరించిన గ్రెటా థన్​బెర్గ్​

By

Published : Oct 30, 2019, 1:00 PM IST

ప్రతిష్టాత్మక పర్యావరణ పురస్కారాన్ని స్వీకరించడానికి స్వీడన్ పర్యావరణవేత్త గ్రెటా థెన్​బెర్గ్ నిరాకరించారు. అధికారంలో ఉన్న ఉన్నవారు సైన్స్​ గురించి వినాలని, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు. ఇందుకు అవార్డులు ప్రకటించడం మాత్రమే సరిపోదని 16 ఏళ్ల థెన్​బెర్గ్​ స్పష్టం చేశారు.

నార్డిక్(ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ మధ్య ఉన్న ప్రాంతం) దేశాల పార్లమెంటుల మధ్య సహకారం కోసం ఏర్పాటైన నార్డిక్ కౌన్సిల్... స్టాక్​హోంలో గ్రెటా థెన్​బెర్గ్​ను సత్కరించింది. 'ఫ్రైడేస్ ఫర్​ ఫ్యూచర్' ఉద్యమం ద్వారా లక్షలాది మంది యువతను పర్యావరణ పరిరక్షణ కోసం కదిలివచ్చేలా చేసినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేసింది.

అవార్డు నాకొద్దు..

నార్డిక్ కౌన్సిల్​ అవార్డుకు థెన్​బెర్గ్​ను స్వీడన్, నార్వే నామినేట్ చేశాయి. చివరకు పర్యావరణ బహుమతిని గెలుచుకున్నారు. అయితే 350,000 డానిష్​ క్రోనార్​ (సుమారు 52 వేల డాలర్లు) విలువైన ఈ బహుమతిని థెన్​బెర్గ్ స్వీకరించరని ఆమె ప్రతినిధి ప్రకటించారు. ఇదే విషయాన్ని థెన్​బెర్గ్ తన ఇన్​స్టాగ్రామ్ పోస్టు ద్వారా ధ్రువీకరించారు.

"పర్యావరణ ఉద్యమానికి అవార్డులు అవసరంలేదు."

- థెన్​బెర్గ్, పర్యావరణవేత్త

నార్డిక్ దేశాలు వాతావరణ సమస్యలపై సరిగ్గా స్పందించడం లేదని థెన్​బెర్గ్ విమర్శించారు. పర్యావరణ పరిరక్షణకోసం చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: ఐరాసలోని భారత బృందంతో ఐరోపా ఎంపీల భేటీ


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details