తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా జాగ్రత్తల మధ్య క్రిస్మస్ వేడుకలు

ప్రపంచ దేశాల్లో క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొన్ని దేశాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు వహిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని దేశాల ప్రజలు వైరస్​ వ్యాప్తిని మరచి యథేచ్ఛగా తిరుగుతున్నారు. కొన్ని దేశాల్లో వేడుకలు జరగకపోవడం గమనార్హం.

Christmas Eve after Russia lifted lockdown restrictions for the festive period
కరోనా వేళ... జాగ్రత్తలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు

By

Published : Dec 25, 2020, 11:21 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు క్రిస్మస్​ వేడుకలు జరుపుకుంటున్నారు.

ఇటలీలోని వాటికన్​ సిటీలో పలు చర్చ్​లు, కార్యాలయాలు, వీధులు క్రిస్మస్​ విద్యుద్దీపాలంకరణలతో కాంతులీనాయి. రాత్రి 10 గంటల నుంచి ఇటలీలో కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో కొందరు ముందుగానే చర్చ్​లకు వెళ్లారు. ఈ ఏడాది వైరస్​ వ్యాప్తి దృష్ట్యా వాటికన్​ సిటీలోని సెయింట్​ పీటర్స్​ బాసిలికాలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని రాత్రి 7.30 గంటలకే నిర్వహించారు.

జాగ్రత్తలు పాటిస్తూ క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్న ఇటలీ ప్రజలు
కాంతులీనిని వాటికన్ సిటీలోని ఓ చర్చ్​

ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెనుజులాలోనూ ప్రజలు క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని మరిచి గురువారం షాపింగ్ పేరిట యథేచ్ఛగా తిరిగారు.

క్రిస్మస్​ సందర్భంగా వెనుజులాలో యథేచ్ఛగా తిరుగుతోన్న ప్రజలు
వెనుజులాలో

క్రిస్మస్​ దృష్ట్యా రష్యాలో కఠిన నిబంధనలకు సడలింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాస్కో ప్రజలు ఆనందంగా​ వేడుకలు జరుపుకుంటున్నారు. విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనిన వీధుల్లో తిరుగుతూ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు.

విద్యుద్దీపాల వెలుగులో రష్యా చర్చ్
కుటుంబ సభ్యులతో గడుపుతోన్న మాస్కో ప్రజలు
రష్యాలో క్రిస్మస్​ వేడుకలు

యూరప్​లోని కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్​ వేడుకలు జరపకూడదని ప్రభుత్వాలు ఆదేశించాయి. వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఇదీ చదవండి:'భారత్​తో చర్చలకు ఇప్పట్లో అవకాశాల్లేవ్​'

ABOUT THE AUTHOR

...view details