భారత్‌లో చేపట్టదలచిన పర్యటనను రద్దు చేసుకోవాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు విపక్ష లేబర్ పార్టీ సూచించింది. భారత్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనాపై ఆందోళనలు పెరుగుతున్నాయని పేర్కొంది. వర్చువల్ పద్ధతిలో అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపాలని జాన్సన్‌కు లేబర్ పార్టీ నేత స్టీవ్ రీడ్ సూచించారు.
'బోరిస్.. భారత పర్యటన రద్దు చేసుకోండి' - లేబర్ పార్టీ
భారత పర్యటన రద్దు చేసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అక్కడి విపక్షం విజ్ఞప్తి చేసింది. భారత్‌లో కొత్త రకం కరోనాపై ఆందోళనలు నెలకొన్నట్లు పేర్కొంది.
బోరిస్ జాన్సన్, భారత్ పర్యటన
విపక్ష ఆందోళనలను బ్రిటన్ పర్యావరణ మంత్రి జార్జి యూస్టైస్ కొట్టిపారేశారు. భారత్‌లో వెలుగు చూసిన కరోనా రకం.. టీకాను ఏమారుస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవనీ, అది ఇతర రకాల కన్నా మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తుందని కూడా చెప్పలేమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:యువకులకూ రీ-ఇన్‌ఫెక్షన్ ముప్పు..!