తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​ వాయిదాకు దిగువసభ ఆమోదం - వాయిదా

బ్రెగ్జిట్​ వాయిదా వేయాలని ఈయూను కోరాలన్న తీర్మానానికి బ్రిటన్​ దిగువ సభ ఒక్క ఓటు మెజారిటీతో ఆమోదం తెలిపింది.

బ్రెగ్జిట్​ వాయిదాకు బ్రిటన్​ దిగువసభ ఆమోదం

By

Published : Apr 4, 2019, 6:56 AM IST

బ్రెగ్జిట్​ వాయిదాకు బ్రిటన్​ దిగువసభ ఆమోదం

ఈ నెల​ 12న ముగియనున్న బ్రెగ్జిట్​ గడువును పొడిగించాలని ఐరోపా సమాఖ్యను కోరాలన్న తీర్మానానికి బ్రిటన్​ పార్లమెంటులోని దిగువ సభ ఆమోదం తెలిపింది. ఒక్క ఓటు ఆధిక్యంతో ఇది సభను దాటింది. నేడు ఈ తీర్మానం ఎగువసభలో ప్రవేశపెట్టనున్నారు.

థెరిసా మే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బ్రెగ్జిట్​ బిల్లును మూడు సార్లు తిరస్కరించింది పార్లమెంటు. ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేసినప్పటికీ ఒక్కదానికీ ఆమోదం లభించలేదు.

ఏప్రిల్​ 12లోగా ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగాల్సి ఉంది. ఒకవేళ ఎలాంటి ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఒప్పందం లేకుండానే నిష్ర్కమించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:బ్రెగ్జిట్​పై అదే ప్రతిష్టంభన- రాజీనామాకు మే సిద్ధం

ABOUT THE AUTHOR

...view details