తెలంగాణ

telangana

ETV Bharat / international

అవును.. ప్రధాని గర్ల్​ఫ్రెండ్​ తల్లికాబోతోందట! - బోరిస్​ వార్తలు

ఆయన ఓ దేశానికి ప్రధాన మంత్రి.. ఆమె అధికార పార్టీకి ఒకప్పుడు కమ్యూనికేషన్ చీఫ్​ . ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. పెళ్లి చేసుకోకుండా ప్రధాని కార్యాలయంలో సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

British leader Boris Johnson, girlfriend expecting baby
అవును, ప్రధాని గర్ల్​ఫ్రెండ్​ తల్లికాబోతోందట!

By

Published : Mar 1, 2020, 4:17 PM IST

Updated : Mar 3, 2020, 1:48 AM IST

బ్రిటీష్​ ప్రధాని కార్యాలయంలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు బోరీస్​ జాన్సన్​, సైమండ్స్​. ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారట. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారట.

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్.. ఆయన నాయకత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఒకప్పుడు కమ్యూనికేషన్​ చీఫ్​గా వ్యవహరించిన సైమండ్స్​తో​ కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు.

ఇటీవల సైమండ్స్​ తాను చాలా అదృష్టవంతురాలినని ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. గతేడాది చివర్లో వారిద్దరికీ నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలో పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వేసవిలో వారు ఓ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిపారు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఇప్పటికే జాన్సన్​ తన రెండో భార్య మరీనా వీలర్​కు నలుగురు పిల్లల సంతానం. 1993లో పెళ్లి చేసుకున్న వారిద్దరూ.. 2018లో విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు సైమండ్స్​ బిడ్డకు జన్మనిస్తే మరోసారి తండ్రి అవుతారు ఈ ప్రధాని.

Last Updated : Mar 3, 2020, 1:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details