తెలంగాణ

telangana

ETV Bharat / international

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రెయిన్​డెడ్​ మహిళ!

చెక్‌ రిపబ్లిక్‌లో అద్భుతం జరిగింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అచేతనావస్థలో ఆస్పత్రిలో చేరిన 5 నెలల గర్భిణిని కొన్నిరోజులకే వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు. నెలలునిండిన తర్వాత విజయవంతంగా కాన్పుచేశారు.

By

Published : Sep 4, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 9:17 AM IST

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రెయిన్​డెడ్​ మహిళ!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రెయిన్​డెడ్​ మహిళ!

సుమారు నాలుగు నెలలుగా బ్రెయిన్ డెడ్ అయిన ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యవిధానాన్ని ఉపయోగించిన చెక్ రిపబ్లిక్ వైద్యులు... ఈ అసాధారణ ప్రక్రియను సుసాధ్యం చేసి చూపారు. అయితే కాన్పు జరిగిన 3 రోజులకు బ్రెయిన్‌ డెడ్‌ మహిళ చనిపోయింది.

చెక్ రిపబ్లిక్ లో ఈ ఏడాది ఏప్రిల్లో 27 ఏళ్ల మహిళ.. అచేతన స్థితిలో బర్నో వైద్య విశ్వవిద్యాలయం ఆస్పత్రిలో చేరింది. కొన్ని రోజులకు శరీరంలోని పలు అవయవాలతోపాటు బ్రెయిన్ కూడా పనిచేయకుండా ఆగిపోయింది. వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. ఆ తర్వాత 117 రోజులకు వైద్యులు విజయవంతంగా ఆమెకు కాన్పు చేశారు. శిశువు 2.3 కిలోల బరువుతో జన్మించింది. సిజేరియన్ విధానంలో ఆమె కాన్పు చేసినట్లు వైద్యులు తెలిపారు.

యంత్రాల సాయంతో చికిత్స

ఆసుపత్రిలో చేరే నాటికే మహిళ 27 వారాల గర్భంతో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించాక కడుపులో బిడ్డను కాపాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యంత్రాల సాయంతో కీలకమైన అవయవాలను పని చేయించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించాయి. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదిగింది. 34వ వారంలో వైద్యులు కాన్పు చేశారు. బంధువుల అనుమతితో కృత్రిమశ్వాసను తొలగించారు. అనంతరం బ్రెయిన్‌ డెడ్‌ మహిళ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: సరదా కోసం వెళ్లి 25మంది సజీవ దహనం

Last Updated : Sep 29, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details