తెలంగాణ

telangana

ETV Bharat / international

పార్లమెంట్​ ముందుకు కొత్త బ్రెగ్జిట్ ఒప్పందం - eu

బ్రిటన్​ ప్రధానమంత్రి థెరిసా మే పలు కీలక అంశాలు, న్యాయపరమైన హామీలతో కూడిన సరికొత్త బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని రూపొందించారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంట్​ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింప చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్లమెంట్​ ముందుకు కొత్త బ్రెగ్జిట్ ఒప్పందం

By

Published : May 22, 2019, 5:45 AM IST

Updated : May 22, 2019, 9:27 AM IST

పార్లమెంట్​ ముందుకు కొత్త బ్రెగ్జిట్ ఒప్పందం
ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్​ వైదొలిగేందుకు చేపట్టిన బ్రెగ్జిట్​ ఒప్పంద ఆమోదానికి ఆ దేశ ప్రధాని థెరిసా మే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఒప్పందానికి 'క్రాస్​ పార్టీ బ్రెగ్జిట్​ చర్చల' నుంచి ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పలు కీలక అంశాలు, న్యాయపరమైన హామీలతో కూడిన సరికొత్త బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని పార్లమెంట్​ ముందుకు థెరిసా మే తీసుకురానున్నారు. రెండో రెఫరెండం(ప్రజాభిప్రాయ సేకరణ)పై పార్లమెంట్​ ఓటింగ్​ కోసం ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్​కు ఆమె తలొగ్గారు. నూతన ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చినట్లు తెలిపారు.

" ఈ ముఖ్యమైన అంశంపై చట్టసభ్యుల మధ్య నిజమైన, నిజాయితీ గల బలాన్ని గుర్తించాను. రెండో రెఫరెండం​ నిర్వహణకు ఓటింగ్​ చేపట్టాలనే డిమాండ్​ను బ్రెగ్జిట్​ ఒప్పంద బిల్లులో ప్రభుత్వం చేర్చుతుంది. ఇది కచ్చితంగా ఆమోదం పొందే లోపే జరుగుతుంది."

- థెరిసా మే, బ్రిటన్​ ప్రధానమంత్రి

బ్రెగ్జిట్​ ఒప్పంద బిల్లును ప్రతిపక్షాలు పలుమార్లు తిరస్కరించటం వల్ల బ్రెగ్జిట్​ గడువును మార్చి 29 నుంచి అక్టోబర్​ 31 వరకు పొడిగించారు.

ఇదీ చూడండి: ట్విట్టర్ నాకు​ ఓ టైపు రైటర్​ : ట్రంప్​

Last Updated : May 22, 2019, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details