తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​ కోసమే యూకే పార్లమెంటు రద్దు..! - బోరిస్

యూకే నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్​ జాన్సన్ ఈయూ నుంచి వైదొలిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ​తాజాగా అక్టోబర్​ 14 వరకు బ్రిటన్​ పార్లమెంటును రద్దు చేయాలని క్వీన్​ ఎలిజబెత్​ IIను కోరారు.

బ్రెగ్జిట్​ కోసమే యూకే పార్లమెంటు రద్దు..!

By

Published : Aug 28, 2019, 5:27 PM IST

Updated : Sep 28, 2019, 3:13 PM IST

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగేందుకు ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రణాళికలు రచిస్తున్నారు. బ్రెగ్జిట్​కు ఆఖరి తేదీ అయిన అక్టోబర్ 31​ లోపు ఎలాగైనా ఈయూ నుంచి తప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం మరో అడుగు ముందుకేశారు. అక్టోబర్​ 14 వరకు హౌస్​ ఆఫ్​ కమన్స్​ను రద్దు చేయాలని క్వీన్​ ఎలిజబెత్​ II ను కోరారు.

ఎందుకు..?

అక్టోబర్​ 14 వరకు పార్లమెంటు రద్దు ద్వారా ఎంపీలు ఎటుంవంటి ముఖ్యమైన చట్టాలను చర్చించేందుకు అవకాశం ఉండదు. బ్రెగ్జిట్​పై ప్రతిపక్షం ఎలాంటి ​అడ్డుకట్ట వేయకుండా ఈ నిర్ణయం ఉపకరించే అవకాశం ఉంది.

ఈయూ నుంచి వైదొలిగాక బ్రిటన్​ పయనంపై కొత్త ప్రధాని నేతృత్వంలోని సర్కారు నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయమని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Last Updated : Sep 28, 2019, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details