ఈ నెలాఖరులో భారత్కు రానున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పర్యటనను కుదించుకున్నారు. భారత్లో కరోనా పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి అధికారి ప్రతినిధి తెలిపారు.
బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన కుదింపు - COVID-19
ఈ నెలాఖరులో భారత్ పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. దిల్లీకే పరిమితం కానున్నారు. భారత్లో కరోనా పరిస్థితి దృష్ట్యా పర్యటన సమయాన్ని కుదించినట్లు అధికారులు తెలిపారు.
బోరిస్ జాన్సన్
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న బోరిస్.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీనిలో భాగంగా బ్రిటన్-భారత్ విస్తృత వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు. ఆయన ఈ నెల 26 నుంచి కొద్ది రోజుల పాటు భారత్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన దిల్లీకే పరిమితం కానున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:టీకా రెండో డోసు తీసుకున్నా: పుతిన్
Last Updated : Apr 15, 2021, 7:29 AM IST