తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ యువరాజు నివాసంలో బుడిబుడి అడుగులు - మేగన్​

బ్రిటన్​ యువరాజు దంపతులు పుత్రోత్సాహంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం మేగన్​ మగబిడ్డకు జన్మనిచ్చారని ప్రిన్స్​ హ్యారీ ప్రకటించారు. తల్లి- బిడ్డలు క్షేమమేనని తెలిపారు.

బ్రిటన్​ యువరాజు నివాసంలో బుడిబుడి అడుగులు

By

Published : May 6, 2019, 9:50 PM IST

Updated : May 6, 2019, 10:25 PM IST

యువరాజు ప్రకటన- ప్రజల సంబురాలు

బ్రిటన్​ యువరాజు హ్యారీ- మేగన్​ దంపతులకు మగ శిశువు జన్మించాడు. సోమవారం ఉదయం 37 ఏళ్ల మేగన్​ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను 34 ఏళ్ల హ్యారీ తన ఇన్​స్టాగ్రామ్​ ద్వారా పంచుకున్నారు.

తల్లి- బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని హ్యారీ తెలిపారు.

"ఈరోజు ఉదయం మాకు మగబిడ్డ జన్మించాడని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. నా జీవితంలో ఇదొక గొప్ప అనుభూతి. మాపై ప్రేమ చూపించిన వారందరికి ధన్యవాదాలు."
-- హ్యారీ, యువరాజు.

ఇది హ్యారీ- మేగన్​ దంపతులకు తొలి సంతానం. ఈ వార్త విన్న బ్రిటన్​వాసులు సంబరాలు జరుపుకున్నారు. 2018 మేలో హ్యారీ- మేగన్​ వివాహం జరిగింది.

ఇదీ చూడండి: ధోని కుమార్తె ఓటు పాఠాలు... నెటిజన్లు ఫిదా!

Last Updated : May 6, 2019, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details