ఆస్ట్రియాలో ఓ యువకుడి అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్న యువకుడు తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతగాడు స్నేహితుల ముందు సాహసం చేసేందుకు ప్రయత్నించి.. అక్కడికి వచ్చిన ఓ పామును నాలుకతో తాకే ప్రయత్నం చేశాడు. కట్ చేస్తే పెళ్లి సంతోషం అంతా ఆవిరై.. ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది.?
జర్మనీకి చెందిన యువకుడు తనకు పెళ్లి కుదరిన నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఆస్ట్రియాలోని న్యూబెర్గ్ ప్రాంతంలో బ్యాచిలర్ పార్టీ చేసుకునేందుకు వెళ్లాడు. స్నేహితుల ముందు సాహసికుడిలా ఫోజ్ కొట్టేందుకు అక్కడికి వచ్చిన వైపర్ జాతికి చెందిన పిల్ల పామును నాలుకతో తాకే ప్రయత్నం చేశాడు. ఇంకేముంది.. పాము చటుక్కున నాలుకపై కాటేసింది. వెంటనే అతడి నాలుక ఉబ్బిపోయి, విలవిల్లాడాడు మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు. గాయపడిన వ్యక్తిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
అయితే పార్టీలో ఉన్నవారు వానపాము అనుకుని వైపర్‌తో ఆటలాడి ఉంటారని రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించింది.
ఇదీ చదవండి:'ఉగ్రవాదులకు ఆసరాగా కరోనా సంక్షోభ పరిస్థితులు'