తెలంగాణ

telangana

ETV Bharat / international

'మా కరోనా టీకా తయారీలో తప్పు జరిగింది'

తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తయారీలో తప్పు జరిగిందని ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనికా ద్వయం వెల్లడించింది. టీకా తక్కువ మోతాదు తీసుకున్న వారిలో ఎక్కువ పనితీరు, ఎక్కువ డోసు తీసుకున్నవారికి తక్కువ పనితీరు కనబరచటంపై ఈ మేరకు వివరణ ఇచ్చింది.

VIRUS-UK-ASTRAZENECA
టీకా

By

Published : Nov 26, 2020, 1:04 PM IST

Updated : Nov 26, 2020, 1:25 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆక్స్​ఫర్డ్- ఆస్ట్రాజెనికా టీకా తయారీ ప్రక్రియలో తప్పు జరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. అందువల్లే వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు పలు సందేహాలకు దారితీశాయని పేర్కొంది. ఈ మేరకు ఆస్ట్రాజెనికా సంస్థ బుధవారం ప్రకటన విడుదల చేశాయి.

తామిచ్చిన వ్యాక్సిన్ డోసులను తీసుకున్న వారిలో కరోనా నిరోధక శక్తి భారీగా పెరిగిందని ఆక్స్​ఫర్డ్ ప్రకటించింది. కొంతమంది వలంటీర్లు రెండు డోసులను తీసుకున్నా.. తగినంత వ్యాధి నిరోధకతను పొందలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సంస్థ.. టీకా తయారీలో తప్పు జరిగిందని తెలిపింది.

ఏం జరిగింది?

ఆక్స్​ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలను ఆస్ట్రాజెనికా సోమవారం ప్రకటించింది. ఆశ్చర్యకరంగా తక్కువ డోసు తీసుకున్న వారిలో వైరస్​ నిరోధకత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. తక్కువ డోసు ఇచ్చిన వలంటీర్లలో 90 శాతం పనితీరు కనిపించగా.. రెండు డోసులను తీసుకున్న వారిలో 62 శాతమే సామర్థ్యం కనబరిచిందని ఆస్ట్రాజెనికా వెల్లడించింది. మొత్తం కలిపి 70 శాతం పనితీరు చూపిందని ఫలితాల్లో తెలిపింది.

ఇదీ చూడండి:చైనా వ్యాక్సిన్​ రెడీ.. ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు

Last Updated : Nov 26, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details