తెలంగాణ

telangana

ETV Bharat / international

'నోటర్ ​డామ్​ చర్చికి ఐదేళ్లలో పూర్వ వైభవం' - ఇమ్మాన్యూయేల్

ఫ్రాన్స్​లోని నోటర్​డామ్​ చర్చిని ఐదేళ్లలో పునర్నిర్మిస్తామని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిదిన్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చర్చి పైకప్పు కాలిపోయింది.

'నోటర్​డామ్​ చర్చికి ఐదేళ్లలో పూర్వ వైభవం'

By

Published : Apr 17, 2019, 5:58 AM IST

Updated : Apr 17, 2019, 7:38 AM IST

'నోటర్​డామ్​ చర్చికి ఐదేళ్లలో పూర్వ వైభవం'

దేశ రాజధాని పారిస్​​లో నోటర్​ డామ్ చర్చిని పునర్​నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. ఐదేళ్లలో ఇంతకు ముందుకన్నా సుందరంగా రూపొందిస్తామని ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

నోటర్​ డామ్​ చర్చిలో జరిగిన ప్రమాదం... దేశాన్ని ఒక్కటి చేసిందన్నారు మేక్రాన్​. ఫ్రాన్స్​లో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, మళ్లీ వాటిని నిర్మించామని గుర్తు చేశారు.

"గత రాత్రి మనం ఒక దగ్గరకు చేరుకోవడం, ఐక్యంగా ఉండటాన్ని గమనించాం" -ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు

Last Updated : Apr 17, 2019, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details