తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​: బోరిస్ ప్రభుత్వం నుంచి కీలక మంత్రి ఔట్ - ఎంపీలు

బ్రిటన్ కేబినెట్​ నుంచి మంత్రి అంబర్​ రూడ్​ వైదొలిగారు. బ్రెగ్జిట్​పై ప్రధాని బోరిస్​ జాన్సన్ వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

బ్రెగ్జిట్​: బోరిస్ ప్రభుత్వం నుంచి కీలక మంత్రి ఔట్

By

Published : Sep 8, 2019, 10:29 AM IST

Updated : Sep 29, 2019, 8:48 PM IST

బ్రెగ్జిట్​: బోరిస్ ప్రభుత్వం నుంచి కీలక మంత్రి ఔట్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నుంచి కార్మిక, పింఛను శాఖ మంత్రి అంబర్​ రూడ్ వైదొలిగారు. బ్రెగ్జిట్​పై బోరిస్​ జాన్సన్​ వైఖరికి నిరసనగానే తాను పదవి నుంచి తప్పుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ప్రధాని బోరిస్​కు రాసిన లేఖలో తాను 'రాజకీయ విధ్వంస రచన'ను సమర్థించలేనని అంబర్​ రూడ్​ పేర్కొన్నారు. పార్టీ విప్​ను ధిక్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

బోరిస్ ఇటీవల 21 మంది అసమ్మతి ఎంపీలను తన పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో అంబర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పంద రహిత బ్రెగ్జిట్​ను నివారించేలా బోరిస్ కొత్త చట్టం తెచ్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నందుకు వారిపై వేటు పడింది.

ఇదీ చూడండి: ఎన్​ఆర్​సీ తుది జాబితాపై ఆర్​ఎస్ఎస్​ ఆందోళన

Last Updated : Sep 29, 2019, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details